కొత్త రేషన్‌ కార్డుల జారీకి విధివిధానాలు

విడివిడిగా రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు
ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ
ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అవిూర్‌ఖాన్ల పేర్లు సిఫార్సు
జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ
ధరణి పేరును భూమాతగా మారు
ఇషా సింగ్‌, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు ఒక్కొక్కరికీ 600 గజాల జాగా..నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌లకు గ్రూప్‌ 1 ఉద్యోగాలు
జంటజలాశయాలకు మల్లన్న సాగర్‌ నుంచి నీటి తరలింపు
వాయనాడ్‌ విషాదంపై సంతాప తీర్మానం.. సహాయక చర్యలు
తెలంగాణ కేబినేట్‌ పలు కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్‌ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క,శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అవిూర్‌ఖాన్‌ల పేర్లను మరోమారు రెకమండ్‌ చచేస్తూ గవర్నర్‌కు తీర్మానం పంపాలని కేబినేట్‌ నిర్ణయించింది. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ధరణి పేరును భూమాతగా మారుస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. కేబినెట్‌ నిర్ణయాలను విూడియాకు వెల్లడిరచారు. గౌరవెల్లి ప్రాజెక్టు పెండిరగ్‌ పనులు పూర్తి చేయడానికి రూ.437 కోట్లు విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించ బోతున్నట్లు వెల్లడిరచారు. ఎన్నికల మేనిఫెస్టోలని అంశాలను తప్పక నెరవేరుస్తామని అన్నారు. క్రీడాకారులు ఈషాసింగ్‌, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు ఒక్కొక్కరికీ 600 గజాల చొప్పున హైదరాబాద్‌లో ఇంటి స్థలం, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు గ్రూప్‌`1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. విధుల్లో చనిపోయిన రాజీవ్‌ రతన్‌ కుమారుడికి మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్‌`1 ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌కు మళ్లీ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించాం.

కోదండరాంరెడ్డి, అవిూర్‌ ఖాన్‌ పేర్లను మరోసారి గవర్నర్‌కు పంపిస్తాం. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు, హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌ జంట జలాశయాలకు తరలిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కొత్త రేషన్‌ కార్డుల జారీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన రేషన్‌ కార్డుల జారీ విధివిధానాల సబ్‌ కమిటీ ఏర్పాటు కానుంది. రేషన్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు విడివిడిగా ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, సీతక్క వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్‌ క్యాలెండర్‌ను కేబినేట్‌ ఆమోదించింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. నేడు అసెంబ్లీ వేదికగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించబోతున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

కేరళలో వయనాడ్‌లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్‌ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రేషన్‌ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్‌ ప్రొఫైల్‌తో హెల్త్‌ కార్డులను జారీ చేయాలని కేబినేట్‌ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్‌ సప్లయిస్‌ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే అర్హులైన పేదలందరికి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్‌, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది.  శ్రీధర్‌ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగిం చింది. మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి నీటిని శావిూర్‌పేట చెరువు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page