రైల్వే కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌వెల్లడి

న్యూదిల్లీ,జూలై24: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది  రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై దిల్లీలో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయి ంపుల కంటే పదింతలు పెంచామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వందశాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో రూ.73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అమృత్‌ ‌పథకం కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టు  చెప్పారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. అమరావతిని అనుసంధానిస్తూ 56 కి. మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు రూపొందించాం. రైల్వే పనులపై డీపీఆర్‌ను నీతి ఆయోగ్‌ ఆమోదించింది.

మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశముంది. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు స్థలం కేటాయింపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. భూమి కేటాయించాలని అధికారులను ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారని కేంద్ర మంత్రి తెలిపారు. ‘తెలంగాణలో రైల్వే లైన్లు వంద శాతం విద్యుద్దీకరణ జరిగాయి. రాష్ట్రంలో రూ.32,946 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అమృత్‌ ‌పథకం కింద 40 రైల్వే స్టేషన్లు పూర్తిగా అభివృద్ధి జరిగాయని కేంద్ర మంత్రి వివరించారు.సౌత్‌ ‌కోస్ట్ ‌రైల్వే జోన్‌ ‌కోసం గతంలో కేటాయించిన భూమికి బ్యాక్‌ ‌వాటర్‌ ‌సమస్య ఉందని, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత నిర్మాణం ప్రారంభిస్తామని అశ్వినీ వైష్ణవ్‌ ‌వెల్లడించారు.

విజయవాడ ఏరుపాలెం నుంచి అమరావతికి కృష్ణనది దుగా రూ.2,047కోట్లతో 56కి.. మేర రైల్వే లైన్‌ ‌నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అమరావతి రైల్వే లైన్‌ ‌కోసం నీతి అయోగ్‌ అనుమతి ఇచ్చిందని, ప్రాజెక్టు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. విజయవాడ నుంచి ముంబైకు వందే భారత్‌ ‌సాధ్యం కాదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌చెప్పారు. తెలంగాణలో  గడిచిన 10ఏళ్లలో 437 ఫ్లైఓవర్లు, అండర్‌ ‌పాస్‌ల నిర్మాణం జరిగిందన్నారు. దేశంలో రూ.1.9లక్షల కోట్లతో రైల్వే సేప్టీ కోసం కేటాయింపులు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైల్వే ప్రమాదాలు యూపీఏ హయాంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో 60శాతం తగ్గాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page