అన్ని వర్గాలకు మేలు…మధ్య తరగతికి భరోసా

న్యూ దిల్లీ, జూలై 23 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024`25లో మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులు, పేదలను దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్‌ ఈ పద్దుని రూపొందించారని వెల్లడిరచారు. ఈ పద్దుతో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు వొస్తాయని అభిప్రాయపడ్డారు.

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ పద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. బడ్జెట్‌పై ధ్రాని మోదీ స్పందిస్తూ…గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, మధ్య తరగతి వర్గం సాధికారత సాధించే విధంగా ఈ బడ్జెట్‌ ఉందని తెలిపారు. విద్యారంగంతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టినట్టు స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎంప్లాయ్‌మెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ని తీసుకురావడం చాలా గొప్ప విషయమని అన్నారు.

గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ఈ సారి బ్జడెట్‌ పూర్తిగా మధ్యతరగతి వర్గానికి మేలు చేసే విధంగా ఉందని అన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధిపై బడ్జెట్లో ప్రాధాన్యత దక్కిందని, మహిళలు, వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలకూ ఊతం అందించే పద్దు ఇదని, యువతకు మేలు చేసే విధంగా ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ స్కీమ్‌ని తీసుకురావడం చాలా గొప్ప విషయం అని అన్నారు. యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కీమ్‌తో లబ్ది చేకూరుతుందని ప్రధాని వెల్లడిరచారు. ఈ పథకంలో భాగంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకి ఓ నెల జీతం అడ్వాన్స్‌గా ఇస్తారని, రూ.లక్షలోపు జీతం ఉన్న వాళ్లు ఈ స్కీమ్‌కి అర్హులుగా కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు గ్రావిూణ ప్రాంతాలకు చెందిన యువత దేశంలోని బడా సంస్థల్లో పని చేసే విధంగా ఈ స్కీమ్‌ ప్రోత్సహించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page