న్యూది•ల్లీ,జూలై19(ఆర్ఎన్ఎ)
కాగా దోషులు రాధేశైమ్ భగవాన్దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనీ పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్ అనుమతించింది. షా మధ్యంతర బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు.2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో పెద్దఎత్తున చోటుచేసుకున్న మతపరమైన అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. 5 నెలల గర్భిణిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారికి 2022లో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది. దీంతో 2022 ఆగస్టు 15న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బానో సుప్రీం తలుపుతట్టారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.. వారి విడుదల చెల్లదని జనవరి 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండు వారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది.