డిజిటల్‌ ‌యుగంలో నైపుణ్యాల యువత!

డిజిటల్‌ ‌యుగంలో యువత ముందంజలో ఉన్నారు. సమకాలీన సవాళ్లకు వినూత్న పరిష్కారాలను అందజేస్తున్నారు. శాంతి నిర్మాణం, సంఘర్షణల పరిష్కారంలో కూడా యువకులు కీలక పాత్రపోషిస్తున్నారు. రేపటి ప్రపంచానికి నైపుణ్యాలతో కూడిన యువత  అత్యంతావశ్యకం. ఇటువంటి యువత భవిష్యత్‌ ‌నాయకులుగా ఎదిగేందుకు విద్యా సంబంధమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా వృత్తి పరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించే విద్యా వ్యవస్థ అవసరం. నైపుణ్యాలతో కూడిన ఆవి ష్కరణల ద్వారా మాత్రమే ఉజ్వల భవిష్యత్తును నిర్మించగలం. ఉపాధి, వ్యవస్థాపకత, వ్యక్తిగత అభివృద్ధి కోసం యువతకు నైపుణ్యాలను  సమకూర్చుకోవడం  ఎంతో అవసరం. సాంకేతిక విద్య, శిక్షణ, ప్రపంచ ఆర్థికవ్యవస్థలకు సంబంధించిన ఇతర నైపుణ్యాల అభివృద్ధి గురించి అవగాహన కలిగి ఉండాలి. శాంతితో కూడిన అభివృద్ధి కోసం యువత నైపుణ్యాలు ఉపయోగపడాలి.నైపుణ్యం అంటే ఏమిటి: చేసేపని తీరులో ఒకరి జ్ఞానాన్ని సమర్థవంతంగా సులభంగా ఉపయోగించగల సామర్థ్యంను నైపుణ్యం అంటారు.

నైపుణ్యం ఎందుకు: నైపుణ్యాల అభివృద్ధి అనేది యువత చేసేపనిని సాఫీగా మారడానికి ఉపయోగపడే ఒక ప్రాథమిక సాధనం. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎజెండాలో 2030 నాటికి యువతకు నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలను కల్పించాలనేది  ప్రధాన లక్ష్యంగా ఉంది. సంబంధిత నైపుణ్యాలు కలిగిన యువతతో పాటుగా పెద్దల సంఖ్య కూడా గణనీయంగా పెరగాలని సుస్థిర అభివృద్ది లక్ష్యం 4.4 లక్ష్యించింది. యువతను ప్రభావితం చేసే అనేక సవాళ్లను  ప్రపంచం నేడు ఎదుర్కొంటోంది. విద్యలో అసమానతలు, స్థిరత్వానికి భంగం కలిగించే హింసాత్మక సంఘర్షణలు, ప్రతికూలతను పెంపొందించే ఆన్‌లైన్‌ ‌వాతావరణం లాంటివి నిరంతర ఆర్థిక అసమానతలకు దారితీస్తాయి. ఈ సమస్యలు వ్యక్తిగత భవిష్యత్తునే కాకుండా సమాజం యొక్క మొత్తం స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. శాంతి సంస్కృతిని, బాధ్యతా యుతమైన ప్రపంచ పౌరులను పెంపొందించడానికి, అందరికీ మరింత న్యాయమైన స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి, సాంకేతికతతో కూడిన నైపుణ్యాలు కలిగిన యువతను తయారుచేయడం చాలా కీలకం.

నైపుణ్యతా సంక్షోభం: ప్రపంచం అత్యవసర నైపుణ్యాలతో ఉన్న యువత లేమిని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని నలుగురి యువకులలో ఒకరు మాత్రమే ఉపాధి, మంచి జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునే మార్గంలో ఉన్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే మిగిలిన ముగ్గురూ పేదరికంలోకి నెట్టబడతారు. ఇది ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. యువకులు పెద్దవారి కంటే నిరుద్యోగులుగా ఉండే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. కొందరు తక్కువ నాణ్యత గల ఉద్యోగాలతో అసమానతల లేబర్‌ ‌మార్కెట్లలో తక్కువ జీతంతో పార్ట్  ‌తాత్కాలిక ఒప్పందాల క్రింద పని చేయవలసి ఉంటుంది.

అరవై కోట్ల ఉద్యోగాలు అవసరం: రాబోయే పదిహేనేళ్లలో యువత ఉపాధి అవసరాలను తీర్చేందుకు దాదాపు అరవై కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అంచనావేశారు. ప్రపంచ వ్యాప్తంగా 2021సం.లో దాదాపు 7.5 కోట్ల యువత నిరుద్యోగులుగా ఉన్నారు. 40.8 కోట్ల మంది ఉపాధి పొందారు. 73.2 కోట్ల మంది శ్రామిక శక్తికి.. దూరంగా ఉన్నారు. 2020లో ఉపాధి, విద్య లేదా శిక్షణలో లేని యువత వాటా 23.3 శాతానికి పెరిగింది. ఇది ముందరి సంవత్సరం కంటే 1.5 శాతం ఎక్కువ. ఇది గత 15 ఏళ్ల గరిష్ఠ స్థాయి. 2021నుండి 2030 మధ్య యువ జనాభా 7.8 కోట్లకు పైగా పెరుగుతుంది. ఈ పెరుగుదలలో దాదాపు సగం తక్కువ ఆదాయం గల దేశాలలో ఉంటారు. విద్య, శిక్షణ వ్యవస్థలు ఈ సవాలుకు ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. మంచి నాణ్యత కలిగిన అప్రెంటిస్‌షిప్‌లు, చక్కగా రూపొందించబడిన ఇంటర్న్‌షిప్‌లు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అటు కొత్త ఉద్యోగార్ధులకు ఇటు యువ గ్రాడ్యుయేట్‌లకు లేబర్‌ ‌మార్కెట్‌లోకి ప్రవేశాన్ని అందిస్తాయి.

నిర్మాణాత్మక నిరుద్యోగం: ఆర్థికవ్యవస్థలోని యజమానులు కోరుకున్న నైపుణ్యాలతో కార్మికులు లేకపోవడాన్ని నిర్మాణాత్మక నిరుద్యోగమని అంటారు. దీనిని నైపుణ్యాల అంతరం అని కూడా పిలుస్తారు. నిర్మాణాత్మక నిరుద్యోగం తరచుగా సాంకేతిక మార్పుల వల్ల అనేక మంది కార్మికుల ఉద్యోగ నైపుణ్యాలను వాడుకలో లేకుండా చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలను మాత్రమే కాకుండా 2030 సుస్థిర అభివృద్ధి ఎజెండాలో ఊహించిన సమానమైన సమ్మిళితమైన సమాజాల పరివర్తనకు ఆటంకం కలిగిస్తుంది.

సవాళ్లు పరిష్కారాలు: సంఘర్షణలు, హింస మరింత అస్థిరతకు దోహదం చేస్తాయి. ఇవి ఉద్యోగకల్పనకు అవరోధాలవుతాయు. అనేక కార్యాలయాల్లో లింగ ఆధారిత హింస, వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వేధింపులు, హింస, సంఘర్షణలు లేని కార్యాలయాలు అవసరం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న  ప్రపంచంలో విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని తగ్గించాలి. వేగవంతమైన పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతి, ఆర్థిక ప్రాధాన్యతలను మార్చగలిగే నైపుణ్యాలు గల యువత అవసరం. కార్మికులు, యువ పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందాలి. వివిధ పరిశ్రమలలో కృత్రిమ మేధ సాంకేతికతల యొక్క వేగవంతమైన ఏకీకరణ పని యొక్క దృశ్యాన్ని మారుస్తుంది. భవిష్యత్తు ఉద్యోగాల కోసం యువతను సిద్ధం చేయడానికి వారికి అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం చాలా ముఖ్యం. ఆర్థిక వ్యవస్థలో యజమానులు కార్మికులుకు డిమాండ్‌ ‌చేసే నైపుణ్యాలను అందించాలి.

మన దేశంలో పరిస్థితి: మన దేశంలో కూడా యువత నైపుణభివృద్ది కోసం స్కిల్‌ ఇం‌డియా మిషన్‌ 15 ‌జూలై 2015 నాడు ప్రారంభించబడింది.ఇది అనేక నైపుణ్య పథకాలు కార్యక్రమాలతో కలిగి ఉన్న పథకం. దేశంలోని యువతకు సంబంధిత రంగాలలో ఉపాధి కల్పించడంతోపాటు ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు తగిన నైపుణ్యంతో సాధికారత కల్పించడం ప్రధాన లక్ష్యం. ఈ మిషన్‌ ‌స్వల్పకాలిక, దీర్ఘకాలిక శిక్షణా కార్యక్రమాల ద్వారా ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచడం, కొత్త నైపుణ్యాలను అందించడంపై దృష్టి పెడుతుంది. 2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ ‌సమావేశాలలో ఆర్థిక మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం స్కిల్‌ ఇం‌డియా మిషన్‌ ‌కింద 1.4 కోట్ల మంది యువత శిక్షణ పొంది నైపుణ్యం పొందారు.                              •
image.png
డి.జె మోహనరావు
యం.ఎస్సీ(ఫిజిక్స్) ‌టీచర్‌,
ఆమదాలవలస,
 శ్రీకాకుళం జిల్లా,
ఆంధ్రప్రదేశ్‌,
8247045230.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page