ఇళ్లు కాలుతున్నాయి..ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

  • ఇప్పటికీ రెండుగా మణిపూర్‌
  • ‌రాష్ట్రం ఇంకా కష్టాల్లో ఉంది..
  • తన మణిపూర్‌ ‌పర్యటన అనుభవాలను ప్రధాని మోదీకి రాహుల్‌ ‌గాంధీ వీడియో సందేశం
  • మణిపూర్‌ను సందర్శించాలని ప్రధానికి సూచన

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 11 : మణిపూర్‌ ఇప్పటకీ రెండు భాగాలుగా విభజించబడి ఉందని లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వెల్లడించారు. మణిపూర్‌లో హింస చెలరేగిన అనంతరం సోమవారం 3వ సారి మణిపూర్‌లో పర్యటించిన తర్వాత అక్కడి పరిస్థితులపై గురువారం 5 నిమిషాల నిడివి గల వీడియో పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌ ‌గాంధీ సందేశంలో వివరించారు. వీడియోలో తాను మణిపూర్‌లోని సహాయ శిబిరాలను సందర్శించిన దృశ్యాలను పొందుపరుస్తూ జాతి హింసతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. మణిపూర్‌ ఇం‌కా కష్టాల్లో ఉందని రాహుల్‌ ఈ ‌సందర్భంగా ఎత్తి చూపారు. ఇళ్లు కాలిపోతున్నాయని, అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వేలాది కుటుంబాలు సహాయక శిబిరాల్లో నివసించవలసి వొస్తుందని రాహుల్‌ ‌గాంధీ తన వీడియో సందేశంలో పంచుకున్నారు.

మణిపూర్‌లోని జిరిబామ్‌ ‌సహాయ శిబిరంలో ఆవాసం చేస్తున్న మహిళతో రాహుల్‌ ‌మాట్లాడుతున్న సందర్భంలో ..తన అమ్మమ్మ ఇప్పటికీ సంఘర్షణ ప్రదేశంలో ఇరుక్కుపోయిందని, ఆమె ఆచూకీ తమకు తెలియదని, ఆమె తమ వద్దకు రాలేదని, తాము అక్కడికివెళ్లలేమని లేదా మేము అక్కడికి వెళ్ళలేమంటూ ఆమె తన గోడును రాహుల్‌ ‌ముందు వెళ్లబోసుకుంది. అలాగే అస్సాంలోని తలైలో సహాయ శిబిరంలో ఉండగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన సోదరుడిని కోల్పోయానని ఒక మహిళ చెప్పింది. ప్రభుత్వం నుంచి సరైన వైద్యం అందకపోవడంతో తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని భోరుమనగా, శిబిరంలో మందులకు కాంగ్రెస్‌ ‌పార్టీ సహాయం చేస్తుందని రాహుల్‌ ‌గాంధీ ఆమెకు హామీ ఇచ్చారు.

ఇక చురచంద్‌పూర్‌లోని సహాయక శిబిరంలో మాట్లాడుతూ ప్రభుత్వం చిత్త శుద్ధితో సంఘర్షణ ముగించాలనుకుంటే త్వరగా ముగుస్తుందని అన్నారు. తాను పార్లమెంటులో బయటా సమస్యను లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి చేయవచ్చు కానీ మళ్లీ మణిపూర్‌ ‌పర్యటనకు వెళ్లడంపై హామీ ఇవ్వలేనని, ఎందుకంటే దానికి అనుమతి ఇవ్వాల్సిన ప్రభ్వుం ఆ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబుతుందన్నారు. తదుపరి పార్లమెంట్‌ ‌సెషన్‌లో తాను మణిపూర్‌ ‌ప్రజల కోసం మాట్లాడతానని రాహుల్‌ ‌గాంధీ మొయిరాంగ్‌ ‌సహాయ శిబిరంలోని నివాసితులతో జరిపిన సంభాషణలను మోదీకి పంపిన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page