మెగా డిఎస్‌సి..గ్రూప్‌ 2, 3 ‌పోస్టుల పెంపు..జాబ్‌ ‌క్యాలెండర్‌

  • ‌డిమాండ్‌ ‌చేస్తూ టిఎస్‌పిఎస్‌సి ముట్టడికి ఎబివిపి యత్నం
  • కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి
  • విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ ‌చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రూప్‌ 2, 3 ‌పోస్టులు పెంచాలని డిమాండ్‌ ‌చేశారు. టీచర్‌ ‌పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలన్నారు. గ్రూప్‌-1 ‌మెయిన్స్‌కి 1 : 100 పిలువాలని డిమాండ్‌ ‌చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్‌ ‌రెడ్డి హావి• ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్‌-2, 3‌తోపాటు ఉపాధ్యాయ పోస్టులు చాలా వరకు ఖాలీగా ఉన్నాయని చెప్పారు. ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు.

రోడ్డుపై బైఠాయించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఒక్కొక్కరిగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ముట్టడించేందుకు ఏబీవీపీ యత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు వొచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ ‌చేశారు.

వెంటనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్‌ ‌చేస్తుంది. అలాగే గ్రూప్‌ 2 ‌పోస్టులు పెంచి నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. తక్షణమే మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ నినాదాలు చేసారు. ఉపాధ్యాయ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఏబీవీపీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page