తప్పులను సమర్థించుకుంటున్న కెసిఆర్‌

  • చత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు..
  • జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట కోదండరామ్‌ వివరణ
  • ఆధారాలు కమిషన్‌ ముందుంచామని వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేసీఆర్‌ చేసిన తప్పులను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. మంగళవారం భదాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట ఆయన హాజరయ్యారు. హైదరాబాద్‌ లోని బీఆర్కే భవన్‌లోని కమిషన్‌ కార్యాలయానికి కోదండరాంతో పాటు విద్యుత్‌ శాఖ అధికారి రఘు వొచ్చారు. వారిద్దరి నుంచి కమిషన్‌ వివరాలు అడిగి తెలుసుకుంది. ఛత్తీస్‌గఢ్‌తో 2000 మెగావాట్లకు ఒప్పందం చేసుకుంటే 200 మెగావాట్లు కూడా రాలేదని కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌కు వెళ్లుంటే రేట్లు తగ్గేవని..ఎంవోయూ ద్వారా ముందుకెళ్లారని ఇది అనుమానించదగ్గదేనని కోదండరామ్‌ కమిషన్‌కు తెలిపినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్‌ గఢ్‌తో కరెంట్‌ కొనుగోళ్లు, యాదాద్రి, భదాద్రి పవర్‌ ప్లాంట్లపై గతంలో అఫిడవిట్‌ వేశామని కోదండరామ్‌ ఈ సందర్భంగా వ్నిడియాకు తెలిపారు.

అందుకు సంబంధించిన ఆధారాలను కమిషన్‌ ముందు ఉంచామన్నారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలన్నారు. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదన్నారు. గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.81 వేల కోట్ల అప్పులు అయ్యాయన్నారు. గత ఏడాది వరదలు వస్తే భదాద్రి ప్లాంటులో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భదాద్రి ఎ్న-లాంటును కాపాడుకోగలమా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఆ తప్పిదాలపై క్రిమినల్‌ చర్యలకు వెనుకాడవద్దని సూచించారు.

అందరూ కూడా చట్టం ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు పవర్‌ కమిషన్‌ విచారకు సంబంధించి కేసీఆర్‌ పంపిన లేఖపై పవర్‌ కమిషన్‌ చైర్మ సవ్నిక్ష చేపట్టారు. భదాద్రి యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్న కమిషన్‌ కేసీఆర్‌ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చిస్తారు. వాస్తవాలపై ప్రతినిధులని కూడా వివరాలు అడుగనున్న కమిషన్‌ చర్చ అనంతరం దాని అనుగుణంగానే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అయితే కమిషన్‌ తీరుపై కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page