దమ్ముంటే రండి…మల్కాజిగిరిలో తేల్చుకుందాం..

  • పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగుదాం
  • కాళేశ్వరంపై నిజాలు చెప్పి గుట్టు విప్పుతాం
  • నీళ్లు ఇవ్వలేని దుస్థితితో సర్కార్‌ అడబ్బుల కోసమే బిల్డర్లకు వేధింపులు
    రేపు వారు రోడ్డెక్కడం ఖాయం
  • మీడియాతో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌
హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: దమ్ముంటే రండి..మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. అంటూ సిఎం రేవంత్‌కు కెటిఆర్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని భారాసకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరిన నేపథ్యంలో.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు.  ధ్కెర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి.. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం అని ప్రతి సవాల్‌ విసిరారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆడబిడ్డలకు రూ.2,500 సహా ఇచ్చిన 420 హాలు అమలు చేయాలని హితవు పలికారు. మాది మేనేజ్‌మెంట్‌ కోటా అయితే.. రాహుల్‌,  ప్రియాంకా గాంధీది ఏం కోటా రేవంత్‌ది పేమెంట్‌ కోటానా.. అలా సీటు తెచ్చుకున్నం దుకు రేవంత్‌.. దిల్లీకి పేమెంట్‌ చేయాలి. బ్యాగులు మోయాలి. ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారులను బెదిరించాలి. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు.
ఇప్పటివరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్‌ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కుతారు. ఆయనే సీఎం అని ఎన్ని సార్లు చెబుతారు. ఆయనకు తానే సీఎం అన్న నమ్మకం లేదా? మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. పాలనలో అన్నీ సీఎం, మంత్రులకు తెలియాలని లేదు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండి‘ అని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం సిల్లీ రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం డియాతో చిట్‌ చాట్‌ నిర్వహించిన కేటీఆర్‌.. మాకు సెన్స్‌ లేదని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారని.. మరి సెన్స్‌ ఉండి నీళ్లు వృధా పోతుంటే కాంగ్రెస్‌ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రేపు మేడిగడ్డ,అన్నారం పర్యటనకు వెళ్తున్నాం. మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లు, అన్నారం బ్యారేజ్‌ లను పరిశీలిస్తాం. అన్నారం బ్యారేజ్‌ దగ్గర డియా సమావేశం నిర్వహిస్తాం. కడియం శ్రీహరి, హరీష్‌ రావు ఇద్దరు రెండు బ్యారేజ్‌ లపై  మాట్లాడుతారు. ప్రాజెక్టు కుంగడం.. ఇదేం కొత్తది కాదు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు అంటూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  కేటీఆర్‌ హితవు పలికారు. డ్యాం సేప్టీ అధికారులు ప్రాజెక్టు కుంగిన దగ్గర సాయిల్‌ టెస్ట్‌ చేశారా?. కనీసం కింద దిగకుండా పై పైన చూసి పోవటం కాదు. దీన్ని ప్రామాణికంగా చేసుకొని మాట్లాడటం సరికాదు. మార్చి 1 తర్వాత నీళ్ళు ఇచ్చే పరిస్తితి లేదు. సెన్స్‌ మాకు లేదు అంటున్నారు.. ఉండి రు నీళ్లు వృధాగా పోతుంటే రేం చేస్తున్నారు?. అందర్నీ తికమక పెడుతున్నారు.  మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేద్దాం. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తా. సీఎం పదవికి రాజీనామా చేసి రేవంత్‌ పోటీ చేయాలి. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం‘ అని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page