ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.46 ఏళ్ల వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వయో పరిమితి సడలింపుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా..వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల కారణంగా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని.. త్వరలోనే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా వయో పరిమితి 46 ఏళ్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయంతో జీవో విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page