జపాన్‌లో తీవ్ర భూకంపం

  • రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదుక సునావిూ హెచ్చరికలు జారీ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

టోక్యో,జనవరి1 :  నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ విూడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో వరుసగా బలమైన భూ ప్రకంపనలు వచ్చాయని వెల్లడిరచాయి. నీగాటా, టొయామా పరిధిలోని తీర ప్రాంతాల్లో సునావిూ వచ్చే అవకాశం ఉందని జపాన్‌ వాతావరణ సంస్థ ఇషికావా హెచ్చరించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:10 గంటల సమయంలో ఈ తీవ్ర భూకంపం సంభవించింది. దీంతో జపాన్‌ పశ్చిమ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది.

హై స్పీడ్‌ ట్రైన్లను జపాన్‌ ప్రభుత్వం నిలిపి వేసింది. తీవ్ర భూకంపం నేపథ్యంలో అణు విద్యుత్‌ ప్లాంట్లలో తనిఖీలు చేయనున్నామని హకురికి ఎలక్ట్రిక్‌ పవర్‌ తెలిపింది. సునావిూ హెచ్చరికల నేపథ్యంలో సముద్రపు అలలు 5 విూటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ ’ఇషికావా’ అప్రమత్తం చేసింది. ప్రజలు వీలైనంత త్వరగా ఎత్తైన ప్రాంతం లేదా సవిూపంలోని భవనాలపైకి ఎక్కాలని కోరింది. వాజిమా సిటీ తీరంలో అలలు ఒక విూటర్‌ కంటే ఎక్కువ ఎత్తులో ఎగసిపడినట్టు స్థానిక విూడియా ’ఎన్‌హెచ్‌కే టీవీ’ పేర్కొంది. కాగా ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. 2011లో జపాన్‌లో భారీ భూకంపంతో సునావిూ వచ్చింది.

అనేక పట్టణాలుగా దెబ్బతిన్నాయి. ఫుకుషిమా అణు కేంద్రం కూడా దెబ్బతిన్న విషయం తెలిసిందే. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ లో ఉన్న జపాన్‌ దేశానికి షాక్‌.. అత్యంత భారీ భూ కంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌ పై 7.5 తీవ్రతగా నమోదైంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌ వెల్‌ కమ్‌ చెప్పే సమయంలో.. తెల్లవారుతూనే జపాన్‌ ప్రజలు బ్యాడ్‌ న్యూస్‌ విన్నారు. ఇషికావా కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. నీగాటా, టొయామా, యమగటా, ఫుకుమా, హ్యోగో, ప్రిఫెక్చర్‌ తీర ప్రాంతాలకు సునావిూ హెచ్చరికలు ఇవ్వటంతోపాటు.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదే విధంగా అలలు 5 విూటర్ల కంటే ఎత్తులో ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు అందరూ సముద్రం నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది.

గతంలో  సునావిూలు విరుచుకుపడినప్పుడు కూడా 7.5 తీవ్రతతలోనే భూకంపాలు వచ్చాయి. దీంతో జపాన్‌ దేశం వణికిపోతుంది. భూకంపం సముద్రంలో రావటంతో.. సునావిూ వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అనే భయం వెంటాడుతుంది.సునావిూ అలలు తీరానికి రావటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు. ఈలోపు తీర ప్రాంత ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. న్యూఇయర్‌ వేడుకలు చాలా వరకు సముద్ర తీరాల్లో ఏర్పాటు చేశారు. జనం కూడా ఎక్కువగా ఆయా ప్రాంతాలకు తరలి వచ్చారు. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page