హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉందని, ఉన్నత విద్యను అభ్యసించిన వారు తిరిగి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ముత్తూట్ గ్రూప్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జోనల్ మేనేజర్ జితేందర్ కుమార్, రీజినల్ మేనేజర్ కెవి.మురళి, హిమాయత్ నగర్ డివిజన్ కార్పోరేటర్ జి.మహాలక్ష్మీరామన్ గౌడ్ చెప్పారు. విద్య ద్వారానే విజ్ఞానం, విజ్ఞానం ద్వారానే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ముత్తూట్ గ్రూప్ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హిమాయత్ నగర్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ జోనల్ కార్యాలయంలో ప్రతిభావంతులైన ఏడుగురు నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేసిన సందర్భంగా వారు మాట్లాడారు. తమ సంస్థ ద్వారా స్కాలర్షిప్ లు పొంది ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు. మెడికల్, ఇంజనీరింగ్, బిఎస్సీ, నర్సింగ్ కోర్సులు చదివే విద్యార్థులకు వారు స్కాలర్షిప్ చెక్కులు అందజేశారు. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వి.శ్రీలక్ష్మి, కౌశిక్ సింగ్, దీపిక, అజ్మలకు రూ.2,40,000, బిటెక్ విద్యార్థులు స్నేహిత, చరణ్, పెట్టెం ఆదర్శణిలకు రూ.1,20,00 ల స్కాలర్షిప్ చెక్కులను వారికి తల్లిదండ్రుల సమక్షంలో అందించారు. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ అధికారులు గోలి రోజా, లక్ష్మీనారాయణ యమగాని తదితరులు పాల్గొన్నారు.