ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 29 : కడ్తాల్ మండల కేంద్రంలో అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఆటా – 2023 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారులపై వేగ నియంత్రణకు మరియు ప్రమాదాల నివారణకు ఉపయోగపడే విధంగా సుమారు లక్ష రూపాయల విలువచేసే బ్యారికేడ్లను స్థానిక సీఐ శివప్రసాద్ కు అందించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర, బాలికల, ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలలకు లక్ష రూపాయల విలువచేసే మైక్ సెట్ లు, బ్యాండ్ సెట్లు మరియు స్కూలు బ్యాగులను ఆటా ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి మాతృదేశంపై తమకున్న ప్రేమను చూపిస్తున్నారని అన్నారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత పదవులు ఉద్యోగాలు సంపాదించాలని కోరారు. 2019, 2021 సంవత్సరాలలో ఆట వారి ఆధ్వర్యంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించిన ఆటా ప్రతినిధి కిషోర్ గూడూరు ను అభినందించారు. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే చేయబడిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క చైతన్యం చదువులలో చూపించాలని భవిష్యత్తులో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటా ప్రతినిధులు రామకృష్ణ ఆలే,సతీష్, నరసింహారెడ్డి, సాయి సూదిని, పరమేశ్వర్, మిమిక్రీ రమేష్ స్థానిక ఎంపీపీ కమ్లి మొత్యా నాయక్, జడ్పిటిసి దశరత్ నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ సర్దార్ నాయక్ ప్రధానోపాధ్యాయులు జంగయ్య, యాదయ్య, సుశీల, అనురాధ అనితల ఉపాధ్యాయులు రాధాకృష్ణారెడ్డి, పద్మ, ఇంద్రారెడ్డి, శ్వేత మాధురి, రత్నమాల, ఎస్ఎంసి చైర్మన్ చందర్ నాయక్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ రెడ్డి, చందోజి, హనుమానాయక్, వేణు పంతులు,జాంగా రెడ్డి, రామచంద్రయ్య, జహంగీర్ అలీ,యాదగిరి రెడ్డి, యాట నరసింహ, జహంగీర్ బాబా, శీను, మల్లయ్య, బిక్షపతి, నరేష్ నాయక్ స్థానిక సీఐ శివప్రసాద్, ఇమ్రాన్, మూడ రవి తదితరులు పాల్గొన్నారు.