సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: నంగునూరు మండలము లోని గట్లమల్యాల, కొండం రాజపల్లి, తిమ్మాయిపల్లి, కొనయిపల్లి గ్రామాలలో జరిగిన ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీ గ్రామసభలలో పాల్గొని మాట్లాడారు. ప్రజా పరిపాలనలో భాగంగా 6 గ్యారెంటీ ల పథకాలు అమలు కోసం ఏర్పాటు చేసిన దరాకాస్తుల స్వీకరణ కార్యక్రమము దిగ్విజయం చేయవల్సిన భాద్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది అని పేర్కొన్నారు.ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రజా పాలనను కోనసాగిస్తుందని స్పష్టం చేశారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇందిరమ్మా యిండ్లు, రేషణకార్డులే నిదర్శనం అని అన్నారు. నాడు రచ్చబండ కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలను అందించినం నేడు ప్రజా పాలన గ్రామసభల ద్వారా అందిస్తు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకున్నామని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మాట ఇచ్చినట్టుగానే, ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసి ఘనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బాగు శ్రీకాంత్ యాదవ్,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గాండ్ల రమేష్, గోనెపల్లి శివ ప్రసాద్ గౌడ్,నాయకులు,దాసరి కిషన్,కుసుమభ రాజేశం,లక్ష్మణ్,రాజు, అనీల్, శ్రీకాంత్, మోతేకాని కనకయ్య, జనార్దన్, మహేష్, వెంకటేష్,కొల్పుల బలకిష, తడ్కపల్లి సుధాకర్, గడ్డం కరుణాకర్, ముక్క సాగర్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.