ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దు కుంటున్న థీమ్ పార్కును పచ్చదనంతో పాటు వివిధ రకాల పూల మొక్కలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, ఈ పనులలో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం బి.ఏన్.రెడ్డి.నగర్ డివిజన్ లోని బి.ఏన్.రెడ్డి.నగర్ ఫేస్.3 నందు ఒక కోటి ఇరవై అయిదు లక్షల రూపాయల వ్యయంతో హెచ్.ఏం.డి.ఏ. ఆధ్వర్యలో నిర్మిస్తున్న థీమ్ పార్క్ పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు ఒక ఏకరం స్థలంలో అద్భుతమైన ధీమ్ పార్క్ నిర్మించడం జరుగుతుంది అని తెలిపారు. ఇందులో అద్భుతమైన బుద్ధుడి విగ్రహం, యోగ చేసుకోవడానికి స్థలం, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే పార్క్, వాకింగ్ ట్రాక్, అద్భుతమైన గార్డెన్ నిర్మించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 50శాతం పనులు పూర్తి కావడం జరిగిందని, పనుల్లో ఇంకా వేగం పెంచి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొనివస్తామని తెలిపారు. నియోజకవర్గ అబివృద్దే తన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు అనిల్ చౌదరి, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.