ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ప్రజలకు గత ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉండేదని పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా నిరుపేదలకు వైద్య చికిత్సల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించే వారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. లింగోజిగూడా డివిజన్ కు చెందిన నాగేశ్వరరావు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతు హాస్పిటల్ లో చికిత్స పొంది అనంతరం నుంచి డిశ్చార్జ్ కావడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత నాగేశ్వరరావు మరణించడం జరిగింది. అయితే నాగేశ్వరరావు కుటుంబం ఆర్థిక స్థితులు బాగలేక ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి
నాగేశ్వరరావు ఆపరేషన్ కు అయిన డబ్బుల వివరాలను తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది. దానికి గాను వారికి 2,00,000 (రెండు లక్షల రూపాయలు) చెక్కు మంజూరు కావడం జరిగింది. ఆదివారం మంజూరైన చెక్కును నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం. సహాయనిధి దోహదపడుతుందని అన్నారు. ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిదని అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిది అండగా ఉంటుందని అన్నారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త ఛాతిరి మధుసాగర్, తిలక్ రావు తదితరులు పాల్గొన్నారు.