కొత్త వేరియంట్‌తో కర్నాటక అప్రమత్తం

  • వేడుకలకు వచ్చే ప్రయాణికులకు టెస్టులు…కేరళ నుంచి వచ్చే పర్యాటకులపై దృష్టి

బెంగళూరు,డిసెంబర్‌23:  ‌కేరళలో కరోనా కొత్త వేరియంట్‌ ‌వ్యాప్తితో పక్క రాష్ట్రాల్లో ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా కర్నాటక అప్రమత్తం అయ్యింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ ‌కొత్త వేరియంట్‌ ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా కర్నాటక రాష్ట్రంలో ముప్పు పొంచి ఉందనే భయం వెంటాడుతోంది. పొరుగు రాష్ట్రం కేరళలోనే ఎక్కువ మందికి వైరస్‌ ‌ప్రబలు తుండటమే ఆందోళనకు కారణమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముప్పును ముందస్తుగానే గుర్తించి ప్రత్యేక నిబంధనలు, సౌలభ్యాలను సిద్ధం చేసుకుంటోంది. దక్షిణాదిన చారిత్రాత్మక ఆధ్యాత్మిక కేంద్రాలు, రిసార్టులు కలిగిన రాష్ట్రం కావడంతో పాటు క్రిస్మస్‌ ‌నుంచి జనవరి ప్రారంభం దాకా గడిపేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు లక్షలాది మంది సిద్ధమయ్యారు.

వీరికి తోడు కేరళ నుంచి నిత్యం వేలాది మంది భక్తులు రాష్ట్రానికి వస్తున్నారు. క్రిస్మస్‌, ‌కొత్త సంవత్సర వేడుకలు వారాంతంలో వచ్చిన మేరకు ప్రత్యేకించి బెంగళూరులో నివసించే లక్షలాది మంది సొంతూళ్లకు వెళ్లి వాపసు వచ్చే వారి ద్వారా వైరస్‌ ‌తీవ్రం కావచ్చునని అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి వచ్చే ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సాధారణ పరీక్షలు ప్రారంభించారు.
వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ ‌గుండూరావు నేతృత్వంలో కొవిడ్‌ ‌పర్యవేక్షణకు కేబినెట్‌ ‌సబ్‌కమిటీని నియమించారు. ఇందులో వైద్యవిద్యాశాఖ మంత్రి శరణప్రకాష్‌ ‌పాటిల్‌, ‌సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప, ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎం‌సీ సుధాకర్‌ ఉన్నారు. వీరు డాక్టర్‌ ‌రవి నేతృత్వంలోని కొవిడ్‌ ‌టె క్నికల్‌ ‌కమిటీ సభ్యులతో కలిసి పర్యవేక్షిస్తారు. ప రిస్థితిని బట్టి ఆంక్షలు, సౌలభ్యాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త సంవత్సర వేడుకలు బెంగళూరులో జరుపుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివస్తారు. ఎంజీరోడ్‌, ‌బ్రిగేడ్‌, ‌చర్చిస్ట్రీట్‌లో లక్షలాదిమంది పాల్గొని వేడుకలు జరుపుకునే సంప్రదాయం ఉంది. ఇలా పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడితే వైరస్‌ ‌ప్రబలే అవకాశాలు ఉంటాయనే భయం వైద్యశాఖకు వెంటాడు తోంది.

మరో వారంలో వేడుకలు ఉండడంతో ఇప్పుడు రద్దు చేసే పరిస్థితి లేనందున ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే ఆలోచనలో ఉంది. ఇదే పరిస్థితి కోరమంగళ, ఇందిరానగర్‌, ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లోనూ వేడుకలకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోవైపు గోవా రాష్ట్రంలో కొత్త సంవత్సర సందడి ప్రారంభమైంది. ఇప్పటికే దేశవిదేశీయులు లక్షలాది మంది గోవాకు చేరుకున్నారు. గోవాకు రాష్ట్రంలోని ఉత్తరకన్నడ, బెళగావి జిల్లాలు అనుబంధంగా ఉన్నాయి. గోవా నుంచి వెనుతిరిగి వచ్చేవారు రోడ్డు, రైలు మా ర్గాలు కూడా ఇవే కావడంతో అక్కడి నుంచి వచ్చేవారిపై నిఘా పెట్టాలని వైద్యఆరోగ్యశాఖ భావిస్తోంది. ఇక నిత్యం వేలాది మంది భక్తులు కేరళ నుంచి వస్తున్నందున సరిహద్దుల్లో పరిశీలిస్తున్నారు. చామరాజనగర్‌ ‌జిల్లాలో తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో చిక్కమగళూరు, కొడుగు, శివమొగ్గ, మండ్య, చామరాజనగర్‌ ‌జిల్లాలో వందలాది రిసార్టులు ఉన్నాయి. ఇక్కడ వారంతం, క్రిస్మస్‌, ‌నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వేలాది మంది వస్తున్నారు.

తొలి విడత కొవిడ్‌ ‌తరహాలోనే మరోసారి రాజీవ్‌గాంధీ చెస్ట్ ఆసుపత్రిలో అత్యవసరంగా 200 పడకలను సిద్ధం చేశారు. నగర పరిధికే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కొవిడ్‌ ‌బాధితులను తీసుకువస్తే ఇక్కడే చేర్చదలచారు. ప్రత్యేకంగా డాక్టర్లు, నర్సులను నియమించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 5వేల టెస్టింగ్‌లు జరపాలని నిర్ణయించిన మేరకు బెంగళూరు పరిధిలో కనీసం 1500 టెస్టింగ్‌లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. నగర పరిధిలోని ప్రధాన ఆసుపత్రులే కాకుండా 144 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను కిట్లు అందుబాటులో ఉంచారు. బీఎంటీసీ బస్సుల్లో మాస్కు నిబంధనలు పాటించేలా ప్రయాణికులకు సూచిస్తున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ ‌నిబంధనలు అమలుకై జి ల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ ‌పట్ల జాగ్రత్తలు అవసరమేనని సూచించిన వెంటనే వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. ప్రతి చోటా మాస్కులు తప్పనిసరిగా వాడటం ఉత్తమమని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page