ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : కడ్తాల మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో వివిద కారణాలతో మృతి చెందిన కుటుంబాలను రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జడ్పిటిసి దశరథ్ నాయక్ చేయూత అందిస్తున్నారు. ఇటీవల మైసిగండి గ్రామం సోని, సక్రు, పవన్, అచమి నాజీ, ముద్విన్ గ్రామంలోని కుమ్మరి మల్లయ్య, కావటి వెంకమ్మ అదేవిధంగా ఎక్వాయి పల్లి గ్రామంలోని దొడ్లపాటి రాములమ్మ, గోవిందాయ పల్లిలో ప్రసాద్ లు మృతి చెందారు. సుమారు 9 మంది కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ. 5వేల చొప్పున రూ.45 వేలు ఆర్థికసాయంగా దశరథ్ నాయక్ అందజేశారు. ఉప సర్పంచ్ రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డిలు ఇంటి నిర్మాణం గురించి పదివేల రూపాయలు జడ్పిటిసి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీటీసీలు లచ్చిరాం నాయక్, ప్రియ రమేష్, సర్పంచులు తులసి రామ్ నాయక్, యాదయ్య, సులోచన సాయిలు, రైతు కోఆర్డినేటర్ వీరయ్య, నరసింహ, మాజీ ఎంపిటిసి చక్రి, మాజీ సర్పంచ్ చాత్రు, ఉప సర్పంచ్ శారద పాండు, డైరెక్టర్ లాయక్ అలీ, నాయకులు హరియా, పొట్టి శీను, పాండు, రవి, రాజా, శ్రీను, సేవ్య, రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.