సీఎం రేవంత్ పై మతి భ్రమించి మాట్లాడుతున్నారు
నీకు ఏ స్థాయి ఉందని అసభ్య పదజాలంతో వీర్రవీగుతున్నవ్
సీఎం రేవంత్ గోటికి కూడా సరిపోవు
నీలాంటి వాళ్ల వల్ల జర్నలిజానికి మాయని మచ్చ
శ్రీనివాస్ రెడ్డి అసమర్థుడు వల్ల అసలైన వారికి సమాజంలో గౌరవం లేకుండా పోతుంది
టీఎస్ 24 ఛానల్ ను బ్యాన్ చే సేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
అతడిపై పరువునష్టం దావా వేస్తాం
పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న సిద్దిపేట కు చెందిన టీఎస్ 24 ఛానల్ యాంకర్ శ్రీనివాస్ రెడ్డి పై ప్రభుత్వపరంగా చర్యలు తప్పవని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పై యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అంటూ తీవ్రస్థాయిలో నోటికి అదుపు లేకుండా రెచ్చిపోతున్న శ్రీనివాస్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని ఎలాంటి అనుమతులు పొందకుండా జర్నలిస్టు అనే ముసుగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే విమర్శలు చేస్తున్నారని అన్నారు. కనీసం మనిషిని అనే ఇంగిత జ్ఞానం లేకుండా మతిభ్రమించి సీఎం రేవంత్ పై విమర్శలు చేయడం తగదని దీనిపై పోలీసులు సుమోటగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. అంతేకాక శ్రీనివాస్ రెడ్డి పై పరునష్టం దావా కేసు వేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి గోటికి కూడా సరిపోని శ్రీనివాస్ రెడ్డి ఒళ్ళు మరిచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నీకు ఎం అర్హత ఉందని సీఎం రేవంత్ రెడ్డి పై వాఖ్యలు చేస్తూ విర్రవీగుతున్నావని సీఎం రేవంత్ గోటికి కూడా నీ స్థాయి సరిపోదని మర్చిపోకు అని హెచ్చరించారు. జర్నలిజం పేరుతో మాయని మచ్చలాగా మారిన శ్రీనివాస్ రెడ్డి లాంటి వారి వల్ల నిజమైన జర్నలిస్టులు సమాజంలో గౌరవం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని మిగతా జర్నలిస్టులు కూడా తరిమివేయాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టు వారదలుగా నిలవాలని ఏదైనా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప వ్యక్తిగతంగా స్థాయిని మించి పాలన చేస్తున్న నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబా అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో శ్రీనివాస్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.