పటాన్ చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల పరిషత్ సమావేశం
గ్రామాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చిన ఆయా గ్రామాల సర్పంచులు
సమస్యలు పరిష్కరిస్తామని అధికారుల హామీ
గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి
-ప్రజల సమస్యలు పరిష్కరించాలి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 20: పటాన్ చెరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ సమావేశంలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సుదీర్ఘ చర్చ కొనసాగింది. మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తమ గ్రామాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ముత్తంగి, ఇస్నాపూర్, గ్రామాల సమస్యల గురించి ప్రస్తావించగా అధికారులు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం గ్రామాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని ప్రజలను వ్యాధులకు దూరంగా ఉంచాలని సూచించారు. వాయిదా పడ్డ పనులు వెనువెంటనే పరిష్కరిస్తామని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తారని అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, తహశీల్దార్ భాస్కర్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ, సుమతి రామచందర్, నర్సింలు, రాజ్ కుమార్, జగన్, వెంకట్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, కుమార్ గౌడ్, మాధవి నరేందర్ రెడ్డి, ఎంఈఓ పి.పి రాథోడ్, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.