141 ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 :  కేంద్ర ప్రభుత్వ ఘోరమైన వైఫల్యాలను ప్రశ్నిస్తే రెండు రోజుల్లో 141 ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమే అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష ఎంపీలు నిలదీస్తే వారిని సస్పెండ్ చేసి అధికార బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి చేసి అరాచకం సృష్టించిందని దిడ్డి సుధాకర్ ఆరోపించారు. పార్లమెంట్ లోపల విద్వంసం సృష్టించిన దోషులకు ప్రవేశ పాస్‌లపై సంతకం చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయకుండా, నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. మొదట, చొరబాటుదారులు పార్లమెంటుపై దాడి చేశారు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌, ప్రజాస్వామ్యంపై దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం విశ్వాసంలేదని, మోడీ ‘విపరీతమైన నియంతృత్వం’ ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమౌతుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తరమికొడతారని డాక్టర్ దిద్ది సుధాకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page