ప్రజలతో అధికారులు మమేకమై పని చేయాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో  రాష్ట్ర రవాణా, బీసీ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశమయ్యారు. పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలి అని అన్నారు. ప్రభుత్వం మారిందని, ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని. ప్రభుత్వ అధికారుల పనితీరు కూడా మారాలని, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నంతో పాటుగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ, పలు శాఖల అధికారులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page