మంత్రుల హోదాలో జిల్లాలో తొలి పర్యటన
కొత్తగూడెం/ఖమ్మం : ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం సమీపంలోని టోల్గేట్ వద్ద మంత్రులకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలు మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.
కూసుమంచి మండల కేంద్రంలోని పి హెచ్ సి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాహాయాన్ని రూ 10 లక్షలకు పెంచుతూ విడుదల చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకన్ గూడెం బస్టాండ్ సెంటర్లోని జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్డు మార్గం ద్వారా మంత్రులు ముందుకు సాగారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం, వరంగల్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికిన సిపిఐ తెలుగుదేశం పార్టీ శ్రేణులు.