- సంపూర్ణంగా కోలుకోవడానికి 6`8 వారాల సమయం
- వెల్లడిరచిన యశోదా వైద్యులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్ సాయంతో బీఆర్ఎస్ అధినేత మెల్లగా అడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
ఇది చూసిన నెటిజన్లు, పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని కాంక్షిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడిరదని యశోద వైద్యులు తెలిపారు. త్వరితగతిన కోలుకునేందుకు అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తుందని చెప్పారు. మానసికంగా కూడా కేసీఆర్ దృఢంగా ఉన్నారన్నారు. మరో రెండు మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6`8 వారాల సమయం పడుతుందని వెల్లడిరచారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపారు.