- ప్రజల్లో ఆనందం కూడా ఇదే తెలియజేస్తుంది
- మేడిగడ్డపై విచారణ జరపాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వొచ్చిన్లటైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజంగా ఇప్పుడే తెలంగాణ వొచ్చిందన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. ప్రజాభవన్ వద్ద సందడి చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం జీవన్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ..గత ప్రభుత్వ పాలన సమైక్యాంధ్ర పాలన కంటే అధ్వాన్నంగా సాగిందన్నారు. రాష్ట్ర అప్పు రూ.6 లక్షల కోట్లకు దాటింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు, నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖనే చెప్పింది. ఆ ప్రాజెక్ట్‌కు అనుమతి కూడా లేదు. లక్షా 20 వేల కోట్ల ఆర్థిక భారం పడిరది.
ఈ ప్రాజెక్ట్ విషయంలో అన్ని రకాల కేసీఆర్ బాధ్యుడని అన్నారు. ఆ ప్రాజెక్ట్‌కి సీడబ్ల్యూసీ అనుమతి కూడా లేదని కేంద్రం చెబుతుంది. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలన్నారు. బాధ్యలైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై వాస్తవాలను ప్రభుత్వం వెలికి తీయడంపై హర్షం వ్యక్తమవుతోంది. వాస్తవాలను ప్రజలకు తెలియ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం ఉన్నందున తుమ్మడి హట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయాలి. తుమ్మడి హట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. మహిళలకు ఉచిత ప్రయాణంపై సోనియా గాంధీ పుట్టిన రోజు నుంచి అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం…అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.