నేటి నుంచి బస్సుల్లో మహిళలకు బాలికలకు ట్రాఫిక్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 8 : ఈనెల తొమ్మిదవ తేదీ నుండి పల్లె వెలుగు ఎక్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు,బాలికలకు, ట్రాన్స్ జెండర్ లకు ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఇబ్రహీంపట్నం సీనియర్ నాయకులు ఈసి. శేఖర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలలో ప్రత్యేకంగా మహిళల కోసం ఉచిత ప్రయాణం కల్పించి వారికి నేనున్నానని చాటి చెప్పారని ఆయన పేర్కొన్నారు. మహిళలతో పాటు ఆడపిల్లలకు ట్రాన్స్ జెండర్ గా ఉన్న వారికి ఆయా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర మహిళలు ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మహిళలు ప్రత్యేకంగా రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు.ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో ప్రమాణ స్వీకారం ఫైల్ పై సంతకం చేయడం రేవంత్ రెడ్డికి ఉన్న చరిత అని ఆయన కొనియాడారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడమే కాకుండా టిక్కెట్లను సైతం భారీగా పెంచారని ఆయన మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేని దృశ్య తెలంగాణ ఏర్పాటు అయ్యాక కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి అనగారిన వర్గాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల పెంచాడని మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాడని ఆయన తెలిపారు.ప్రమాణ స్వీకారం రెండవ రోజు నుండే పథకాలను అమలు చేసేందుకు కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉన్నాడనటంలో సందేహం లేదని ఆయన పేర్కొన్నారు.ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను ఐదు సంవత్సరాల పూర్తి కాలంలో ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.కొందరు కల్లబొల్లి మాటలు చెప్పి ఇచ్చిన హామీలు నెరవేరవని ప్రజలు పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని అలాంటి కుయుక్తులు ఈతెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page