కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 8 : నేదునూరు ఎంపిటిసి కందుకూరు మండల వైస్ ఎంపిపి గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి. అఫ్జల్ బేగ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో మొదటి సంతకం ఆరు గ్యారెంటీలపైన చేసినందున నేదునూరు గ్రామ మహిళలు,గ్రామస్తులు,పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,ఘడిల పాలనకు చరమ గీతం పాడిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తూ ప్రజలకు సేవకులుగా ఉంటూ,కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుందని వారు తెలియజేశారు గత టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దళితులతో పాటు అన్ని వర్గాలను సైతం మోసం చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని వారు విమర్శించారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే అభివృద్ధి చెందిందని మిగతా జాతుల పట్ల కైంకర్యం ప్రదర్శించి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా చిన్న చూపు చూశారని వారు మండిపడ్డారు. అందుకే ఈఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కేవలం కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది పనులు ప్రారంభం అవుతాయని నమ్మి సకలజనులు ఓటు వేశారని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంకగాళ్ల సంజీవ,నిరటి పెంటయ్య,యంజాల్ రెడ్డి,యండి పాషా,యండి మిస్కిన్ ఖాన్,బుక్క పాండు రంగారెడ్డి,పాపగాళ్ల యాదయ్య,మహేందర్,దర్శన్, సుధాకర్,మహేష్,శ్రీను,కృష్ణా,శం