పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన కందుకూరు మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సొరసాని రాజశేఖర్ రెడ్డి
కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 6 :మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడో సారి విజయం సాధించిన సబితాఇంద్రా రెడ్డిని ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షులు సురసాని రాజశేఖర్ రెడ్డి,యువజన విభాగం నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్ రెడ్డి,కాసోజు ప్రశాంత్ చారి,ఎగ్గిడి గణేష్,రామకృష్ణ,శ్యామ్ బాబు లు కలిసి సబితారెడ్డి నివాసంలో పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా మాజీమంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గంలో తన విజయం కోసం కృషి చేసిన నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ప్రతి కార్యకర్త వెనుక బిఆర్ఎస్ పార్టీ ఆధారాభిమానాలు ఉన్నాయని తన విజయం కోసం రాత్రింబవళ్లు కష్టపడి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని,వారి కష్టాలను తెలుసుకునే విధంగా ప్రయత్నం చేసి వారి కష్టాలను సైతం తొలగించేందుకు ప్రయత్నం చేస్తానని సబితా రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటినుండి అయినా ప్రజల్లోకి ప్రతి ఒక్కరు వెళ్లాలని మీతో పాటు తాను ఎల్లప్పుడూ వారి మధ్యలోనే ఉంటానని ఆమె నాయకులకు హామీ ఇచ్చారు.