ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 6 : కడ్తాల మండలంలోని గడ్డమీది తండ గ్రామపంచాయతీకి చెందిన చినావత్ ఫూల్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ గడ్డమీద తండాకు చేరుకొని ఫూల్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఫూల్యా కుటుంబానికి జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రమేష్, శ్రీను, బన్సీ, సోమ్లా, గణేష్, రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు.