సీపీఆర్ పై విద్యార్థులకు అవగాహన

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 6: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సెన్సైస్ (ఎన్బీఈఎంఎస్), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్స్ ఫోరమ్ (ఐసీఏ-ఎస్ఎఫ్)ల సంయుక్త సౌజన్యంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం హఠాత్తుగా ఒక మనిషి కుప్పకూలినప్పుడు (కార్డియోసల్మనరీ రిససిటేషన్ – సీపీఆర్) నిర్వహించాల్సిన ప్రక్రియపై విద్యార్థులకు వర్చువల్ గా శిక్షణనిచ్చారు. ఈ దేశవ్యాప్త ప్రజా అనగాహనా కార్యక్రమంలో పాల్గొనేవారికి సీపీఆర్ శిక్షణ ఇవ్వడమే గాక, ప్రాణాలను రక్షించే సాంకేతికత ప్రాముఖ్యతను వివరించారు.సీపీఆర్ అనేది గుండె కండరాలపై ఒత్తిడిని వర్తింపజేయడం ద్వారా సరెనై వెద్ద్య సహాయం పొందేవరకు ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన సాంకేతికత. శిక్షణ పొందిన వెద్యుడు సీపీఆర్ చేయడంపై వివరణాత్మక సూచనలను అందించారు. దీనిని నేర్చుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలను జారీచేశారు.ఈ ఆన్లైన్ సెషన్  గీతం ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని, సీపీఆర్ గురించి విలువెన జ్ఞానాన్ని పొందారు.గీతం సందర్శించిన నార్త్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ డీన్.నార్త్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ బిజినెస్ డీన్ రిచర్డ్ బుటిమర్ బుధవారం హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడ ఉన్నత విద్యనభ్యసించడానికి గల అవకాశాలను వివరించారు. నార్త్ ఫ్లోరిడా వర్సిటీ నిర్వహిస్తున్న కోర్సులు, నాటి వ్యవధి, ఫీజు, చదువుతూనే సంపాదించే అవకాశాలు, కోర్సు పూర్తయ్యాక శిక్షణ, పనిచేయడానికున్న వ్యవధి, ఉద్యోగావకాశాలు వంటి పలు అంశాలను విడమరిచి చెప్పారు. దీనికి అదనంగా తమ వర్సిటీ ఉన్న జాక్సన్విల్లే పట్టణంలో నెలకొని ఉన్న అంతర్జాతీయ షిప్పింగ్, ఫిన్టాక్ కంపెనీలు, అక్కడ నివసిస్తున్న భారతీయుల గురించి చెప్పారు.10+2+3 విధానంలో చదివే భారతీయ విద్యార్థులకు యూఎస్ మాస్టర్స్ డిగ్రీలో చేరడానికి వారు చదివిన సబ్జెక్టులు, క్రెడిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని బుటిమర్ తెలిపారు. అసలెనై ధ్రువీకరణలు సమర్పించడం ద్వారా ఇమ్మిగ్రేషన్, వీసా వంటి సమస్యలను అధిగమించొచ్చన్నారు.యూఎస్ లోని అధిక ఫీజుల కంటే కెరీర్ అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఐఎంఎఫ్ఎస్ కన్సల్టెంట్ సంస్థ దక్షిణ భారత డెరైక్టర్ అజయ్ కుమార్ వేములపాటి నొక్కిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page