సిఎల్పి నేతగా రేవంత్ పేరు ఖరారు చేసిన కాంగ్రెస్
7న సిఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం
విూడియా సమావేశంలో ప్రకటించిన కెసి వేణుగోపాల్
ఉదయం నుంచి సిఎం పదవిపై వరుస భేటీలు..చర్చలు
ఖర్గే, వేణుగోపాల్‌లతోతో డికె శివకుమార్ భేటీ
కెసి వేణుగోపాల్లో ఉత్తమ్, భట్టిల చర్చ
హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన దిల్లీికి రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. సిఎల్పి నేతగా రేవంత్ పేరును కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ ప్రకటించారు. 7వ తేదీన రేవంత్ సిఎంగా ప్రమాణం చేస్తారని ప్రకటించారు. సిఎల్పి నేతగా రేవంత్‌ను ఎన్నుకున్నామని, అధిష్టానానికి అందిన నివేదకల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సిఎల్పీ తీర్మానం మేరకు నిర్ణయించామని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ బాగా పనిచేశారని, కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డారని అన్నారు. రేవంత్ ఓ డైనమిక్ లీడర్ అంటూ వేణుగోపాల్ తెలిపారు. దిల్లీిలో విూడియా సమావేశంలో ఠాక్రే, డికె శివకుమార్ పాల్గొన్నారు. మంతరివర్గ కూర్పు తదితర విషయాలను రేపు ప్రకటిస్తామని అన్నారు. మరోవైపు అధిష్ఠానం పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాసేపటి క్రితమే గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా నుంచి దిల్లీికి బయలు దేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి సీఎం పదవీపై స్పష్టమైన హావిూ రావడంతోనే రేవంత్ బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.