తెలంగాణ జన సమితి జిల్లా కన్వినర్ నీరుడి స్వామి
గజ్వేల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: తెలంగాణ జన సమితి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కోదండరాంని సిద్దిపేట టీజేఎస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారుడు మలిదశ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో కోదండరాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాటినుండి నేటి వరకు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం పై తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు నియామకాలు చేపకట్టకపోవడం, నిధులను ఒకే కుటుంబానికి సమకూర్చుకొని తెలంగాణ ప్రజలు అగం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి పరీక్షలు కాకుండానే పరీక్షలు రద్దుచేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి విద్యార్థుల మరణాలకు కారకులైన బారాస రాష్ట్ర ప్రభుత్వాన్ని కెసిఆర్ ను గద్దె దించే వరకు పోరాటం చేసిన ప్రొఫెసర్ కోదండరాము ని మర్యాదపూర్వకంగా హైదరాబాదులోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో కలవడం జరిగింది. తెలంగాణ కోసం ఆత్మబలి దానం చేసుకున్నటువంటి అమరుల త్యాగాలు వారి కుటుంబాలకు అండగా ఉండే విధంగా మరియు తెలంగాణ ఉద్యమకారులను సముచిత స్థానం కల్పించే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సాధించుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు పూర్తిస్థాయిలో అమలు జరిగేటట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటానని కార్యకర్తలు అందరం సమిష్టిగా పనిచేయాలని కోదండరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా కో కన్వీనర్ ప్రవీణ్ యూత్ విభాగ అధ్యక్షులు దుబ్బాక స్వామి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.