దేశ వ్యాప్త  ఎస్సీ, ఎస్టి సబ్ ప్లాన్ చట్టం చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  దేశ వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టి సబ్ ప్లాన్ చట్టం చేయాలని దళిత బహుజన ఫ్రంట్  వ్వవస్ధాపక అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్,డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ లు డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం డీల్లీ లో జరిగి‌న దళిత్ మార్చ్ టూ పార్లమెంటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా కొరివి వినయ్ కుమార్,పి.శంకర్ లు మాట్లాడుతూ సామాజిక న్యాయ సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. భారత రాజ్యాంగ స్థానంలో మను అధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్న బిజెపి విధానాలను మానుకొవాలన్నారు.,రాజ్యాంగ బద్దంగా దళితులు సాధించుకున్న  ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం,రిజర్వేషన్ లను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగాయని అన్నారు. బాధితులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వం దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న పెత్తందారులకు కొమ్ముకాస్తున్నదని, భారత రాజ్యాంగ హక్కులను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడటం లేదన్నారు .ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నదన్నాతు.   ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో  రిజర్వేషన్ల అమలు చేయకపోవడం వలన ఉన్నత విద్య చదివిన దళిత విద్యార్థులు ఉపాధికి దూరం అవుతున్నారన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి నిధులు తగ్గించి ఉపాధి హమి పధకాన్ని  ఎత్తి వేయాడానకి చేస్తున్న కుట్రలను మానుకొవాలని పట్టణాలలో ఉపాధి పధకాన్ని ప్రవేశ పెట్టాలని  డిమాండ్ చేశారు. భూ సంస్కరణలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎన్ఎఎడబ్ల్యు జాతీయ నాయకులు మట్టగల్ల వెంకటయ్య,డిబిఎఫ్ రాష్య కార్యదర్శి పులి కల్పన,టివివియు నాయకులు నర్సింహ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page