హ్యాట్రిక్‌ ‌సీఎంగా కేసీఆర్‌

ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌కాదు..వేరుగా ఎగ్జాక్ట్ ‌పోల్స్
‌ఫలితాలు బిఆర్‌ఎస్‌కు అనుకూలం
మళ్లీ కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉంది…చేసిన పనులే గెలిపిస్తాయి
డియా సమావేశంలో స్పీకర్‌ ‌పోచారం శ్రీనావాస్‌ ‌రెడ్డి

కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌రాష్ట్రంలో హ్యాట్రిక్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోమారు అధికారం బిఆర్‌ఎస్‌దే అన్నారు. ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌తప్పు అని రుజువు కాబోతున్నదని అన్నారు. శనివారం డియాతో మాట్లాడుతూ… మేము గెలుస్తున్నం. ఎగ్జిట్‌ ‌పల్స్ ‌వేరు, ఎగ్జాక్ట్ ‌పోల్స్ ‌వేరు. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ ‌సంస్థలు పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. వారికి అనుకూలంగా ఇస్తున్నారు. పోలింగ్‌ ‌పూర్తి కాకముందే ఎలా ఎగ్జిట్‌ ‌పోల్స్ ఇస్తారు. లక్షలాది మంది మనసులో కేసీఆర్‌ ఉన్నాడు. కర్ణాటక నుండి డబ్బులు పంచినం, గెలుస్తున్నం అని కాంగ్రెస్‌ ‌పార్టీ అనుకుంటుంది. సైలెంట్‌ ‌వోట్లు కేసీఆర్‌కు పడ్డాయి…బీఆర్‌ఎస్‌కు 70 నుండి 75 సీట్లు వొస్తాయి. మాస్‌ ‌వోటర్‌…‌క్లాస్‌ ‌వోటర్‌ ‌వేరు. క్లాస్‌ ‌వోటర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌వైపు ఉన్నారని పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కెసిఆర్‌కు ప్రజల్లో ఆదరణ ఉందని, ఆయన చేసిన పనులే గెలుపునకు దోహదం చేస్తున్నాయని అన్నారు. గతంలో కరెంట్‌, ‌నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడా బాధలు లేవని, ఇవన్నీ ప్రజల ముందున్న పనులని అన్నారు.  2004లో కాంగ్రెస్‌  ‌పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమని అన్నారు.

తెలంగాణ రాకముందు మంచి నీళ్ళ కోసం బాధ పడ్డామని, ఇప్పుడు మిషన్‌ ‌భగీరథతో ఆ సమస్య లేకుండా నీళ్ళ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మంచీ.. చెడును చూసి..ఆలోచించి వోటేసారని నమ్ముతున్నామని అవే సానుకూల ఫలితాలకు దోహదం చేస్తాయని అన్నారు. మూడు రాష్టాల్ర సంగమ ప్రాంతమిదని, మహారాష్ట్రలో పెద్ద మొత్తంలో ఆదాయం ఉన్నప్పటికీ సంక్షేమం లేదని, కర్ణాటకలో సరిగా కరెంట్‌ ఇవ్వడం లేదని స్పీకర్‌ ఆరోపించారు. కర్ణాటకలో కేవలం 5 గంటల కరెంట్‌కే గొప్ప అంటున్నారని, తెలంగాణలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. రైతు బంధు దుబారా అంటున్న వారు నిజాలు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ ‌నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రైతు బంధు ఆపామని, ఎన్నికలు అవ్వగానే అకౌంట్లలో వేస్తామని కేసీఆర్‌ అన్నారు. దళిత బంధు పథకంను భారత దేశంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తీసుకొచ్చిందని, దఫాలుగా అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు.  తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షల 18 వేలతో దేశంలో అభివృద్ధిలో ముందున్నామన్నారు. తెలంగాణ తలసరి విద్యుత్‌ ‌వినియోగం 22 వందల యూనిట్లతో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌లో ఉన్నామని  వ్యాఖ్యానించారు. ఇవన్నీ సానుకూల అంశాలని, వీటి ఆధారంగానే ఓటు వేశారని, అందుకే గెలుపు బిఆర్‌ఎస్‌ ‌పక్షం కాబోతున్నదని స్పీకర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page