కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయని పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెంట్ బేరి రామచందర్ యాదవ్పేర్కొన్నారు. శనివారం కెపిహెచ్బి 4వ ఫేస్, 7వ ఫేస్ గోవర్ధనగిరి పర్వతంపై శ్రీకృష్ణ దేవాలయంలో యాదవ సంఘం సభ్యులు ప్రతి సంవత్సరం కార్తీక వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాదవ సంఘం సభ్యులు పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెంట్ బేరి రామచందర్ యాదవ్ ని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కూకట్పల్లి ప్రాంతంలో యాదవులందరూ కలిసికట్టుగా వచ్చి వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం యాదవుల ఐక్యతకు చిహ్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు అల్లం శ్రీనివాసరావు యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, రమణ యాదవ్ బిల్డర్, గిరి యాదవ్, యాదవ్ సంగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.