ఇందిరమ్మ రాజ్యంతో మహిళలకు బసుల్లో ఉచిత ప్రయాణం

హరీష్‌ రావు నిర్వాకం వల్లే ఆగిపోయిన రైతు బంధు

బకాంగ్రెస్‌ అధికారాంలోకి రాగానే  ఎకరాకు 15 వేలు అందజేస్తాం
బరెవెన్యూ డివిజన్‌గా మరిపెడ
బమరిపెడ విజయ భేరి సభలో  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

మరిపెడ, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి రాష్ట్రంలోని మహిళా మణులకు  ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మరిపెడ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పార్టీ నేతలు రేవంత్‌ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. డోర్నకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రు నాయక్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ…ఈ ప్రాంత ఇలవేల్పు కురవి వీరభద్ర స్వామి ఆశీర్వాదంతో  డోర్నకల్‌ లో కాంగ్రెస్‌ పార్టీ  12 సార్లు విజయం సాధించిందని అన్నారు.  ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్‌ పార్టీపై చూపిస్తున్న అభిమానం తనకు గెలుపుపై  సంపూర్ణ విశ్వాసం కలిగించిందని చెప్పారు. బిఆర్‌ఎస్‌ మంత్రి హరీష్‌ రావు నిర్వాకం వల్ల కేంద్ర ఎన్నికల కమిషన్‌ తెలంగాణ ప్రాంత రైతులకు రైతుబంధు పథకం నిలిపివేసినట్లు పేర్కొన్నారు. హరీష్‌ తొందరపాటు నిర్ణయంతో ఈ ప్రాంత రైతాంగానికి రైతు బంధు పథకం నగదు దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయంతో రు 5000 కోట్ల నిధులు ఆగిపోయాయని అన్నారు. అయితే బాధ పడాల్సిన అవసరం లేదని, రానున్న తమ ప్రభుత్వంలో  రైతులకు ఎకరాకు 15000 అందించి రైతు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు సైతం తాము రైతు బంధు పథకాన్ని వర్తింప చేస్తామని అన్నారు. ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ పథకం ద్వారా ప్రతి ఉపాధి కూలీకి సంవత్సరానికి 12000 వారి ఖాతాలో వేయనున్నట్లు తెలిపారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో  డోర్నకల్‌ నియోజకవర్గంలో గిరిజనుల విద్యకు  తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు.

ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్‌ పథకం తమ ప్రభుత్వ హయాంలో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వైయస్‌ చేపట్టిన పాదయాత్ర కారణంగా ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని ఉచిత విద్యుత్‌ పథకం ముమ్మాటికీ కాంగ్రెస్దే అని పునరుద్ఘాటించారు. 2023 ఎన్నికలకు  సంబంధించిన కాంగ్రెస్‌ పార్టీ తయారు చేసిన మోనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారెంటీ పథకాలను రేవంత్‌ రెడ్డి వివరించారు. 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా నగదు ఆడబిడ్డ చేతిలో పెట్టాలని సోనియాగాంధీ ఆదేశించినట్లు తెలిపారు.  ఈ ప్రాంత బిఆర్‌ఎస్‌ నాయకులు  అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.  నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువతకు కొలువులు దక్కలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్నాళ్ళకి మొదటి సంతకం కొలువుల నియమాకాలపైనే  ఉంటుందని స్పష్టం చేశారు. తమ ఆగ్ర నేత రాహుల్‌ గాంధీ విద్యార్థులతో చర్చించి కొలువులకు సంబంధించిన అంశాలను వివరించినట్లు తెలిపారు. డోర్నకల్‌ నియోజకవర్గంలో మరిపెడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌ గా మార్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో తమ పార్టీ ఈ ఎన్నికల్లో 100 సీట్లు సాధించి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.   డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రు నాయక్‌ ని గెలిపించాలని ప్రజలను వోటర్లను అభ్యర్థించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ రామ సహాయం సురేందర్‌ రెడ్డి, మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి నాయక్‌, మహబూబాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు భరత్‌ చంద్రారెడి,్డ బలరాం నాయక్‌, నెహ్రూ నాయక్‌, వల్లూరి కృష్ణారెడ్డి, పెండ్లి రఘువీర్‌ రెడ్డి, ఒంటికొమ్ము యుగంధర్‌ రెడ్డి, గంధసిరి అంబరీష  అక్కినపల్లి సాయి చందు   గంధసిరి వీరభద్రం  సంతోష్‌ రెడ్డి పిల్లి వీరయ్య డోర్నకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఫేక్‌ లేఖతో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం : రేవంత్‌ రెడ్డి ట్వీట్‌
ప్రచారం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. రైతుబంధుపై సీఈసీకి పీసీసీ అధ్యక్షుడి హోదాలో తాను రాసినట్లు.. ఫేక్‌ లేఖను సృష్టించి బీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఓటమి భయంతో బీఆర్‌ఎస్‌ దిగజారి ఫేక్‌ ప్రచారాలు చేస్తోందన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోవాలని సీఈసీ, ఎస్‌ఈసీ వికాస్‌రాజ్‌, డీపీని కోరుతున్నామని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page