లెక్కింపు కేంద్రాలలో విధులు నిర్వహించే సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి శిక్షణ

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 26: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమీకృత జిల్లా కార్యలయల సముదాయంలో సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలలో విధులు నిర్వహించే సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి జిల్లా మాస్టర్ ట్రైనర్ ప్రధాన అధికారి అయోధ్య రెడ్డి మరియు బృందం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ…. జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులో గల ఇందూరు కళాశాలలో జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు డి బ్లాక్ ను, హుస్నాబాద్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సి బ్లాక్, గజ్వేల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఇ బ్లాక్, దుబ్బాక నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఏ బ్లాక్ లను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మీకు అందజేయబడిన పిపిటి ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంకి సంబంధించిన వివిధ రౌండ్ ల వారీగా లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన కౌంటర్లు, పొలిటికల్ పార్టీ సభ్యుల సిట్టింగ్, మొత్తం కౌంటింగ్ ప్రక్రియ వీక్షించే విధంగా ఆర్వో కాబిన్ ఏర్పాటు ఉంటుంది. కౌంటింగ్ సెంటర్లలో కంట్రోల్ యూనిట్ మిషన్లను రిజల్ట్ వచ్చే వరకు ప్రతిది పోలిటికల్ పార్టీ సభ్యులకు చూపించాలి. సెంటర్లలో 24/7 సీసీ కెమెరాలలో రికార్డు అవుతూ ఉంటుంది. కంగారు పడకుండా అత్యంత జాగ్రత్తగా నెమ్మదిగా ప్రక్రియను చేపట్టాలి. ఎలాంటి సమస్య ఏదైనా ఆర్వోను సంప్రదించాలి. కౌంటింగ్ కేంద్రంలో అత్యుత్సాహం పనికిరాదని జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. పోలింగ్ డే ముగిసిన తర్వాత నియోజకవర్గాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు ఆ తరగతులలో ఎలాంటి డౌట్స్ ఉన్నా అధికారులకు తెలిపి నివృత్తి చేసుకోవాలి.
అనంతరం కౌంటింగ్ సూపర్వైజర్లుగా మరియీ సెక్టర్ అధికారులుగా నియమితులైన సెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి సెక్టర్ అధికారి మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ లలో సదుపాయాలకు సంబంధించి 2రోజులు ముందుగానే పర్యవేక్షణ చెయ్యాలి. అధికారులు 29వ తేదిన మీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములలో కమిషనింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని మీ రూట్ మ్యాప్ అనుగుణంగా పోలింగ్ స్టేషన్లకు ఈవీఎం మిషను పోలింగ్ సిబ్బందిని బస్సుల ద్వారా చేర్చాలి. ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా ఆర్వో ను సంప్రదించాలి. పోలింగ్ రోజు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సైతం ఈవిఎం మిషన్ల ను ఆయా మార్గాల గుండా ఇందూరు కళాశాలలోని స్ట్రాంగ్ రూములలో చేర్చే వరకు పూర్తి బాధ్యత సెక్టార్ అధికారులదే. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతమైన వాతవరణం లో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కృషి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దుబ్బాక, హుస్నాబాద్ ఆర్వోలు గరిమా అగ్రవాల్, బెన్ షాలం, ఎలక్షన్ సూపరిండెంట్ రామేశ్వర్, కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page