ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 25: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించి,నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు వోటు వేసి గెలిపించాలని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తూ అధికారికంగా ఆన్ని పండుగలను నిర్వహించడం సి ఎం కేసీఆర్ కే సాధ్యమని లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంమీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లో రాజీవ్ నగర్ గాస్పల్ బాప్టిస్ట్ చర్చ్ లో జరిగింది.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తూ అధికారికంగా పండుగలను నిర్వహించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాత్రమే సాధ్యమని అన్నారు. ఉప్పల్ భగాయత్‌లో రెండు ఎకరాల్లో 10 కోట్ల రూపాయలతో క్రిస్టియన్ భవన్ నిర్మిస్తున్నారన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు చర్చిల నిర్మాణానికి కఠిన నిబంధనలు ఉండేవని గుర్తు చేశారు. క్రిస్టియన్
కమ్యూనిటీకి సంబందించిన సమస్యలేమైనా ఉంటే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించి, ఉప్పల్ నియోజకవర్గం అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నన్ను మీరంతా ఆశీర్వదిస్తారని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రభుదాస్ , శ్రీదేవీ యాదవ్, దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పావని మణిపాల్ రెడ్డి, అంజయ్య, నాయకులు బన్నాల ప్రవీణ్, గంధం నాగేశ్వర రావు , తిమోతి, సెక్రటరీ ప్రభాకర్, ట్రెజరర్ సామ్యూయేలు, రంగారావు, ఫెలోషిప్ ఛైర్మన్ గోన పిలుపు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ పాల్గొన్నారు.