శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 22: బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను మళ్ళీ గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ 9 వేల కోట్ల రూపాయలతో నాంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. తాను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆదరణ చూపెడుతూ మళ్లీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు 9 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలుకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.