ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 22: సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని, బారస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని విజయపథంలో నడిపిస్తాయని కొత్తపేట డివిజన్ యువ నాయకులు సాయి కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గ కొత్తపేట డివిజన్ పరిధిలో కొత్తపేట డివిజన్ యువ నాయకులు సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో దాదాపు 230 అపార్ట్మెంట్స్, 23 కాలనీల నందు బారస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి మద్దతుగా గత 20 రోజులుగా గడప గడపకు తిరిగి సుధీర్ రెడ్డి విజయం కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎల్.బి.నగర్ నియోజకవర్గన్నీ సుధీర్ రెడ్డి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. స్కై ఓవర్లు, అండర్ పాస్ లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, రోడ్లు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. వారు చేసిన అభివృద్దే మరొక్కమారు వారి విజయనికి నాంది పలుకుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సుధీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాట పాండు గౌడ్, కాట రాజ్ కుమార్, గంగాధర్ రావు, కాట సాయిరాం, గోపాల్, మోహిత్ రెడ్డి, రోహన్ సింగ్, త్రిశంక్ గౌడ్, భారత్, చైతన్య, వంశీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.