గిరిజన తండా అభివృద్ధి చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ దే మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పాదీన తరువాత గిరిజన తండాలఏర్పాటు చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ కే దక్కుతుందనిరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మంగళవారం మహేశ్వరం మండలంలో డబిల్‌గూడ, మన్సన్‌పల్లి,కొత్త తండా ,ఉప్పుగడ్డ తండా,గంగారం తండా,గంగారం,సిరిగిరిపురం, హర్షగూడ గ్రామాల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు,ఊరు ఊరున ప్రజాలు ఘన స్వగతం పలికారు.కారు గుర్తుకు ఓటు వేసి గెల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు కుట్రలు పన్ని రైతుబంధు ఆపేయించిన కాంగ్రెస్‌.. మరి పీఎం కిసాన్‌ సమ్మాన్‌కి ఎందుకు అడ్డుపడలేదు..కాంగ్రెస్ పార్టీ ఆదినుంచీ రైతువిరోధిగా వ్యవహరిస్తోంది.కాంగ్రెస్‌ అన్నంత పనీ చేసింది. ఇప్పటికే 3 గంటల కరెంటే చాలు అని చెప్తున్న హస్తం పార్టీ అన్నదాతలకు రైతుబంధు, రుణమాఫీ అందకుండా అడ్డుపడింది. రైతుబంధు ఆపాలని ఆ పార్టీ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొన్న ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది అన్నారు.గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించిన ఘనత కెసిఆర్ దే.అర్హులకు 5లక్షల బీమా.. 93లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి, తెల్లరేషన్కార్డుదారులకు సన్నబియ్యం, ఆసరా పింఛన్ 5,016, దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు.రైతుబంధు ఎకరాకు ఏటా 16వేలు, మహిళలకు ప్రతి నెలా భృతి, 400 కి గ్యాస్ సిలిండర్.సొంత జాగాలేని పేదలకు ఇండ్ల స్థలాలు,ఇల్లు కట్టుకోవటానికి 3 లక్షలు గృహ లక్ష్మి పథకాలు ప్రవేశ పెడతామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి ,ఎమ్ పీపీ సునీత అంధ్యా నాయక్,మండల పార్టీ అద్యక్షుడు రాజు నాయక్,మల్లేష్ యాదవ్, కంది అరుణ రమేష్, కర్రోళ్ల చంద్రయ్య,కర్నాటి మనోహర్, ఎం నవీన్, ఈశ్వర్ నాయక్,సీతారాం నాయక్ ,రాజు నాయక్, విర్యానాయక్, కూన యాదయ్య , నరసింహ యాదవ్, కరుణాకర్ రెడ్డి , కడమోని ప్రభాకర్, ఆదిల్ అలీ , పోల్కం బాలయ్య,ఎమ్ ఏ సమీర్, మేనాక్షి పటేల్ , గుండెమోని అంజయ్య ముధిరాజ్,వెంకటేశ్వర్ రెడ్డి ,పాండు యాదవ్, సుధాకర్ రెడ్డి, మోతిలాల్, లక్ష్మణ్,రవి నాయక్ సర్పంచ్ లు, ఎం పి టి సి లు,బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page