ప్తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 22 : కాంగ్రెస్ వస్తే మళ్ళీ రాష్ట్రంలో దళారుల రాజ్యమే వస్తుందని టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో మళ్లీ దళారుల రాజ్యమేనని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, ఎవ్వళ్లు ఏం చేసిండ్రు. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవ్వళ్లు ప్రజం కోసం పాటు పాటుపడతారనేది ఆలోచించి ఎన్నికల ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని అన్నారు ప్రజలు ఎన్నికలంటే ఆగమాగం కావద్దని బాగా ఆలోచించి వోటేయాలె. అందుకు కావాల్సిన ప్రజాస్వామ్య పరణతి మనలో రావాలె. మీరు ఆషామాషీగా వోటేస్తే గెలువాల్సిన వాళ్లు కాకుండా ఇతరులు గెలుస్తరు. అప్పుడు వాళ్ల పాలన బాగున్నా లేకున్నా ఐదేండ్లు భరించాలె. కాబట్టి ఓటేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలను చూడాలె. ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను పరిశీలించాలె. ఏ పార్టీ చరిత్ర ఏంది.. తెలుసుకుని వోటేయాలని సీఎం చెప్పారు. సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల బాగుకోసం పుట్టింది. 15 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించిందని అన్నారు. గతంలో 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏమి జరిగిందని ఆలోచించాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కాగ్న నది నీళ్లను వడపోసుకొని తాగేవారని టిఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో తెలంగాణ రాకముదు ప్రజలు చాలా బాధలు పడ్డారని, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారని అన్నారు. బీఆర్ఎస్ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ కిట్టు అమ్మ ఒడి ఆడపిల్ల పుడితే 13000 మగ పిల్ల పుడితే 12000 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తోపాటు రైతుల సంక్షేమం కోసం దేశంలో మొట్టమొదటగా ఎక్కడ లేని విధంగా దళిత బంధు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. అదేవిధంగా రైతుల కు రైతు బీమా రైతుల పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఉత్తంకుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం వేస్ట్ అని అంటున్నారని, కాంగ్రెస్ వస్తే రైతుల కోసం తెచ్చిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్తున్నారని ఉండాలా వద్దా అని ప్రజలు చెప్పాలని కోరారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఐదు గంటలే విద్యుత్ ఇస్తున్నారని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు 24 గంటలు విద్యుత్ ఇచ్చే బిఆర్ఎస్ కావాలా ఐదు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలని ఆలోచించాలని అన్నారు తప్పకుండా తాండూర్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తామని అన్నారు రాష్ట్రంలో 3500 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. గతంలో గిరిజనులను ఎవరు పట్టించుకోలేదని బీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు ఆత్మగౌరాన్ని ప్రతిబింబించేలా హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో కనివిని ఎరగని విధంగా బంజారా భావన్ ను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుబంధు ఎకరానికి సంవత్సరానికి 16000 వస్తాయని అన్నారు.మీ తాండూరు అభివృద్ధి కోసం నీతి నిజాయితీగా పని చేస్తున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రోహిత్ రెడ్డి అడిగినవన్నీ నూటికి నూరు శాతం శాతం ఇస్తామని అన్నారు. ఎన్నికల్లో రోహిత్ రెడ్డిని గెలిపిస్తే దళిత బంధు దళిత భీమా సంక్షేమ పథకాలు వస్తాయని తెలిపారు. అదేవిధంగా మైనారిటీల సంక్షేమం కోసం అనేక రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు కత్తి ఒక్కడికి ఇచ్చి యుద్ధం ఒకడికి చేయమంటే సరిపోదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ అని అన్నారు. సభకు వచ్చిన జనాలను చూస్తే అర్థమవుతుందని తప్పక విజయం టిఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి అన్నారు. రోహిత్ రెడ్డి అడిగినవన్నీ తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తాండూర్ అభివృద్ధి కోసం తప్పకుండా తాండూర్ లో అభివృద్ధి కోసం నెరవేరుస్తామని అన్నారు.బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో 1680 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మళ్లీ తాండూర్ కు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా శివసాగర్ ప్రాజెక్టు జుంటుపల్లి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, తాండూరు లో పీజీ కాలేజ్ మంజూరు చేయాలని, అదేవిధంగా తాండూరు ప్రాంతంలో ఎక్కువగా ఉన్న నాపరయి పరిశ్రమలకు విద్యుత్ రాయితీ ఉల్లి రైతులకు కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా అతిథి గృహం మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తాండూర్ ను ఎన్నికల్లో తాండూర్ ప్రజలు మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలు ఆశీర్వదించి ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే కేశవరావు పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి స్పీకర్ మధుసూదన చారి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.