తొమ్మిదేళ్ల పాలనలో వేలకోట్ల అప్పులు

రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టించారు
రాష్ట్ర విభజన సమయంలో ధనిక రాష్ట్రం
బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు
తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదు
‘మీట్‌ ‌ది గ్రీట్‌’ ‌కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్‌ ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె మంగళవారం తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్‌ ‌జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆమె అక్కడ ఏర్పాటు చేసిన మీట్‌ ‌ది గ్రీట్‌ ‌కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ‌లోటు బడ్జెట్‌కు తీసుకువచ్చిందన్నారు. 2014లో రాష్ట్రం విభజన సమయంలో తెలంగాణలో ధనిక రాష్ట్రమని, తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్‌ ‌రాష్ట్రాన్ని వేలకోట్ల అప్పుల పాలు చేశాడని తెలిపారు. రాబోయే తరాల మీద భారం మోపేలా కేసీఆర్‌ ‌తొమ్మిదేళ్ల పాలన ఉందన్నారు. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్‌దని మండిపడ్డారు. తెలంగాణ అవశ్యకతకు సంబంధించిన నీళ్లు, నిధులు నియమాకాలు ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదని ఆమె చెప్పారు. వేలకోట్లు అప్పులు తెచ్చి ఒక్క ప్రాజెక్ట్‌ను కూడా సరిగా పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌నాణ్యత అధ్వానంగా ఉందని, పి•ల్లర్లు కుంగిపోవడం మామూలు విషయం కాదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ ‌మోసం చేశాడని పేర్కొన్నారు. తాటికొండ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసి ఆరు నెలల్లోనే ఆ పదవి నుంచి తొలగించారన్నారు. కేసీఆర్‌ ‌ప్రజలు గురించి కాకుండా కేవలం కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. ప్రశ్న పత్రాలు లీకు చేయడం సిగ్గుచేటన్నారు. విద్య ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని, రాష్ట్రంలో 11 యూనివర్శిటీల్లో 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 3016 నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు.. ఉద్యోగాలు భర్తీ చేయలేదు అని ఆమె తెలిపారు. 17 సార్లు ప్రశ్నపత్రాలు లీక్‌ ‌చేసి నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునేలా బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రైతుల ఆత్మహత్యలపై నిర్మలా సీతారామన్‌ ‌కామెంట్స్ ‌ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ బీఆర్‌ఎస్‌ ‌చేయడం లేదన్నారు.

బంగారం లాంటి రాష్ట్రాన్ని అధ్వాన్నంగా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణకు జాతీయ పసుపు బోర్డును మోదీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చాక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకువచ్చిన మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని, రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్సు తీసుకురావడం సాధ్యం కాదని చెప్పారు. జనవరి 22న అయోధ్య దర్శనానికి తెలంగాణ వృద్దులను ఉచితంగా తీసుకెళ్తామన్నారు. ప్రధాన మంత్రి కావాలని కేసీఆర్‌ ‌ప్రాంతీయ పార్టీనీ జాతీయ పార్టీగా మార్చారనిన్నారు. అభివృద్ధి పేరుతో అప్పుడు చేస్తున్నారు తప్పా.. ఏం చేయడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఎప్పటినుంచో ఉన్న కంపెనీలను చూపిస్తూ అభివృద్ధి అంటున్నారని, కానీ ఇతర జిల్లాలలో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని నిర్మలా సీతారామన్‌ ‌వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page