అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

లెక్కింపు కేంద్రాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు
కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ‌వోటింగ్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌తెలంగాణలో నవంబర్‌ 30‌న జరగనున్న పోలింగ్‌ ‌నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా 49 లెక్కింపు కేంద్రాలను ఎంపిక చేసింది. ఇప్పటికే పనులు స్టార్ట్ ‌చేసింది ఈసీ. హైదరాబాద్‌ ‌మహానగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. కోట్ల విజయభాస్కర్‌ ‌రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్‌, ‌జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గాల వోట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కౌంటింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కోటి చొప్పున వోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.


49 వోట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు : ముషీరాబాద్‌  ఏవీ కళాశాల-దోమల్‌ ‌గూడ, మలక్‌పేట ఇండోర్‌ ‌స్టేడియం-అంబర్‌ ‌పేట, రెడ్డి ఉమెన్స్ ‌కళాశాల- నారాయణగూడ, ఖైరతాబాద్‌, ‌జూబ్లీహిల్స్ ‌కోట్ల విజయభాస్కర్‌ ‌రెడ్డి ఇండోర్‌ ‌స్టేడియం-యూసుఫ్‌ ‌గూడ, సనత్‌ ‌నగర్‌  ‌కాలేజ్‌ ఆఫ్‌ ‌కామర్స్ అం‌డ్‌ ‌బిజినెస్‌ ‌మేనేజ్‌మెంట్‌, ఓయూ క్యాంపస్‌. ‌నాంపల్లి  జేఎన్టీయూ ఫైన్‌ ఆర్టస్, ‌మాసబ్‌ ‌ట్యాంక్‌. ‌కార్వాన్‌  ‌ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ‌కళాశాల, మాసబ్‌ ‌ట్యాంక్‌. ‌గోషామహల్‌  ‌తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి. చార్మినార్‌  ‌కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌ ‌కళాశాల, నాంపల్లి. చాంద్రాయణగుట్ట  నిజాం కళాశాల, బషీర్‌ ‌బాగ్‌. ‌యాకత్‌ ‌పురా  సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ, నాంపల్లి. బహదూర్‌ ‌పురా  అరోరా కళాశాల, బండ్లగూడ. సికింద్రాబాద్‌  ‌డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ ‌సెంటర్‌, ఓయూ. కంటోన్మెంట్‌  ‌వెస్లీ కళాశాల, సికింద్రాబాద్‌. ‌

రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వోట్ల లెక్కింపు : ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల ఎక్కింపు సివిఆర్‌ ఇం‌జనీరింగ్‌ ‌కళాశాల, ఎల్బీనగర్‌ ‌నియోజకవర్గ లెక్కింపు సరూర్‌ ‌నగర్‌ ఇం‌డోర్‌ ‌స్టేడియం, రాజేంద్ర నగర్‌, ‌చేవెళ్ల, షాద్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గాల కౌటింగ్‌ ‌లార్డస్ ఇం‌జనీరింగ్‌ ‌కళాశాల, రాజేంద్రనగర్‌, ‌శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలిలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా నవంబర్‌ 30‌వ తేదీన ఎన్నికల పోలింగ్‌ ‌జరుగుతుండగా, డిసెంబర్‌ 3‌వ తేదీన కౌటింగ్‌ ‌చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు ఈ నెల 30న జరగనుండటంతో పోలింగ్‌కు ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తొలిసారి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా ఇవాళ ఇంటింటి ఓటింగ్‌లో భాగంగా సీనియర్‌ ‌సిటిజన్స్ ఓటు వేశారు.

ఇక, ఇంటి నుంచే ఓటు వేసేందుకు ముందుగా ఫామ్‌ ‌డి-12 సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ ‌పేర్కొంది. దీని ద్వారా ఎన్నికల అధికారి వారికి ఓటు వేసేందుకు పర్మిషన్‌ ఇస్తారు. అయితే, తెలంగాణలో 28,057 మందికి ఇంటి దగ్గర నుంచి ఓటు వేసేందుకు ఈసీ అధికారులు అనుమతించగా ఓటింగ్‌ ‌పక్రియ కొనసాగుతుంది.  అయితే, పోలింగ్‌ ‌సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయోవృద్ధులు ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేశాక వాటిని పోలింగ్‌ ‌సిబ్బంది సేకరించి తీసుకుని వెళ్తున్నారు. ముందుగా సమాచారం అందించి ఓటు వేయించేందుకు పోలింగ్‌ ‌సిబ్బంది ఇళ్లకు చేరుకుంటున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది అని ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌పేర్కొంది. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లపై సీఈసీ వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించింది. బీఆర్కే భవన్‌ ‌లో వీడియో కాన్ఫరెన్స్ ‌లో సీఈఓ వికాస్‌ ‌రాజ్‌, అడిషనల్‌ ‌సీఈఓలు లోకేష్‌, ‌సర్ఫరాజ్‌, ‌డిప్యూటీ సీఈఓ సత్యవాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ఓటింగ్‌ ‌పై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో నవంబర్‌ 30‌న జరుగనున్న పోలింగ్‌ ‌పై ప్రధానంగా చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page