వంగి వంగి దండాలు పెడతారు
అడిగితే నింగిని సైతం రాసిస్తారు
పొంగేకొద్దీ బాగా ఊదరకొడతారు
లొంగనివారికి తాయిలం ఇస్తారు
నేతలు బహు వేషాలు ధరిస్తారు
చెప్పే మాటలకు చక్కెర పూస్తారు
ఒడ్డు చేరాక నాలుక మడతేస్తారు
ఒట్టు తీసి ఇట్టే గట్టున పెట్టేస్తారు
– వి.రమేష్ బాబు
బీఆర్ ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్ రావు మధిర,వైరా,డోర్నకల్ మరియు సూర్యాపేట నియోజక వర్గాల ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.నాలుగు దశాబ్దాలుగా గోసపడిన ప్రజలకు కాళేశ్వరం వరంగా మారిందన్నారు. ఏడాదిలో పది నెలలు కాలువలు నిండుగా పారుతున్నాయని అన్నారు. ధాన్యం అందించడంలో పంజాబ్ ను అధిగమించామని తెలిపారు. ధరణిని తీసేస్తే మళ్లీ దలారుల రాజ్యం వొస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వనపర్తి,నాగర్ కర్నూల్,అచ్చంపేట మరియు జూబిలీ హిల్స్ లో కాంగ్రెస్ విజయ భేరీ యాత్ర నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యం మళ్లీ ఎందుకని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.
నాగార్జునసాగర్, శ్రీశ్కెలం, జూరాల, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు ఇందిరమ్మ రాజ్యంలోనే కట్టినవేనని, ఇప్పటివరకు తుఫాన్లు, వరదలు వొచ్చినా కూడా రాయిలా గట్టిగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కోట్లలో అవినీతికి పాల్పడినందున అప్పుడే మేడిగడ్డ వంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీల వల్లే హైదరాబాద్‌కు మంచి మంచి కంపెనీలు వొస్తున్నాయని అన్నారు.