కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీమ్ భరత్
చేవెళ్ల, ప్రజాతంత్ర , నవంబర్ 21: చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాబాద్ మండల పరిధిలోని….సీతారాంపూర్,నగర్ గూడ,తాళ్లపల్లి,లక్ష్మరావు గూడ, వెంకమ్మ గూడ, మక్త గూడ, దోస్వాడ,గ్రామాలలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ మాట్లాడుతూ…భూ కబ్జా దారుడు,దళిత ద్రోహి దళితులకు తీవ్ర అన్యాయం చేసినటువంటి వారు ఎమ్మెల్యే యాదయ్య అని భీం భారత్ అన్నారు.మొయినాబాద్,షాబాద్, చేవెళ్ల,మండలలో ఎవ్వరు ప్లాట్లు,వెంచర్లు చేసిన కమిషన్ ఇస్తే ఊరుకుంటారు.లేనిపక్షంలో జేసీబీలతో కులాగోడతాడన్నారు.సెటిల్మెంట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారన్నారు. పేద కుటుంబాలకు ఐదు ఎకరాలు భూమి పంచింది,ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత ఇందిర గాంధీ దన్నారు.కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి ఇవ్వ లేద్దన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన రైతులకు భూములను చందన వెళ్లి,సీతారామ్ పూర్,గ్రామాలలో 3000 ఎకరాల భూములను రైతుల దగ్గర తక్కువ ధరకు (లక్షలలో) తీసుకొని బడాకంపెనీలకు కోట్ల రూపాయలకు అమ్ముకొని మన డబ్బులతో గాజ్వెల్,సిద్దిపేట,సిరిసిల్ల, నియోజకవర్గలు అభివృద్ధి చేసుకున్నారు,మన సొమ్మునంత తీసుకపోయిన కెసిఆర్,కేటీఆర్ లకు సహకరించిన కాలే యాదయ్యకు వచ్చే ఎన్నికలలో గట్టిగా బుద్ది చెప్పాలన్నారు. జీవనోపాధి లేకుండా చేసిన కెసిఆర్, యాదయ్యలకు వచ్చే ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలన్నారు.మీ భూములకు డబ్బులు ఇవ్వ కుండా మోసం చెసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తిరిగి ఇప్పిస్తామన్నారు.మీకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారికి డబ్బులు ఇచ్చేంతవరకు మీ తరుపున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లా వేళల అందుబాటులో ఉంటానన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.ఒక నవశకం రాబోతుందన్నారు.షాబాద్ గడ్డ ఋణం తీర్చుకోవాలంటె మీరందరు చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిది మోసం చేయకండన్నారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.తల్లి సోనియా గాంధీ ఇచ్చిన ఆరు హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనె నెరవేరుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.