26న దుబ్బాకకు సీఎం కేసీఆర్‌

దుబ్బాకలో  బిఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది: మంత్రి తన్నీరు హరీష్‌ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో  ఈనెల 26న బి ఆర్‌ ఎస్‌ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో  స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌ రావు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ బిజెపి తోడు దొంగలే.. ఇది దుబ్బాకలో ఆరోజు నాలుగో సభ . హెలికాప్టర్‌ పై రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. సమావేశం అనంతరం బై  రోడ్డు ద్వారా వెళ్తారు. పోయిన ఎలక్షన్లలో దుబ్బాక కి కేసీఆర్‌ వచ్చి ఉంటే అప్పుడే గెలుపొందేవారు. దుబ్బాక అంటే ముఖ్యమంత్రికి ఎంతో ప్రేమ కెసిఆర్‌ పర్యటనతో దుబ్బాకలో  బి ఆర్‌ ఎస్‌ పెద్ద ఎత్తున భారీ మెజారిటీ తో గెలవ బోతుంది. సభకు కత్తిపోట్లతో గాయపడ్డ  ప్రభాకర్‌ రెడ్డి కూడా వస్తారు.దుబ్బాకలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ ఉంటుంది. బిజెపి నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శన చేస్తున్నారు..తమ సొంత పార్టీ నాయకులకే బిజెపి మీద నమ్మకం లేదు. రాష్ట్రంలో బిజెపి గెలవదని బిజేపీ ప్రభుత్వం రాదని ప్రజలకు ఏమి చాలదని  ఐగులంతా బిజెపి నుండి వెళ్ళిపోతున్నారు.బిజెపిలో ఉన్నటువంటి విజయశాంతి కానీ వివేకానిచంద్రశేఖర్‌ కానీ  రాష్ట్ర నాయకులు గ్రామస్థాయికులు బిజెపి నుండి వెళ్ళిపోతున్నారు.పార్టీ నాయకులకి బిజెపి మీద నమ్మకం లేదు మరి ప్రజలకు ఎట్లా నమ్మకం ఉండాలి బిజెపి నాయకులు చెప్పే మాటలన్నీ నీటి మీద రాతలు.మేనిఫెస్టో అనేది ఒక ఫార్సు పోయినసారి బిజెపి ఒక సీటు గెలుచుకుంది.

బిజెపి ఇప్పుడైతే డకౌట్‌ ఒకటో రెండు.బిజెపి రాష్ట్రంలో ఎలా ప్రభుత్వాన్ని ఫామ్‌ చేస్తది.బిజెపి నాయకులు మాట్లాడే మాటలు ప్రజలను మభ్య పెడుతున్నారు.ప్రజలకు కూడా స్పష్టత వచ్చింది అభివృద్ధి చేసే వారికి ఓటేస్తామం టున్నారు.24 గంటల కరెంటు ఇవ్వాలంటే కెసిఆర్‌ ఏ కావాలి.కాలేశ్వరం నీళ్లు రావాలంటే కెసిఆర్‌ రావాలి.బిజెపి ప్రజలకు ఏమన్నా ఇచ్చింది అంటే చేనేతలకు జీఎస్టీ ని పెంచింది. గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచింది.. హ్యాండ్లుమ్‌ నడ్డి విడిచింది ఎవరు బిజెపి.బీడీ కార్మికుల నడ్డి గిరిచింది ఎవరు బిజెపి పార్టీ బీడీలు చిట్టి  బతుకును ఈడుస్తున్న అక్కాచెల్లెళ్లకు బీడి కట్టలపై జిఎస్టి పెంచింది బిజెపి పార్టీ దేశంలో కాంగ్రెస్‌ పార్టీ గానీ బిజెపి పార్టీ బీడీ కార్మికులను పట్టించుకోలేదు కానీ  కెసిఆర్‌ గారు నెల లీలా 2016 ఇచ్చి కడుపులో పెట్టుకున్నారు.బీడీ కట్టడం మీద జిఎస్టి పెంచిన బిజెపికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు.రెండు పార్టీలు కూడా బీడీ కార్మికులకు అన్యాయం చేశాయి.

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ వస్తే బీడీ కార్మికుల పింఛను ఐదువేలకు పెంచుకోబోతున్నాం. బీడీ కార్మికులకు తోబుట్టు లాగా ఓ కన్న తండ్రి లాగా కేసీఆర్‌ అండగా ఉన్నారు.బిజెపి గానీ కాంగ్రెస్‌ గానీ వాళ్ళ చేతుల ఉన్న షార్ట్లను లాక్కునే ప్రయత్నాలు చేసిండ్రు.ముల్గే నక్క మీద తాటి  కాయ పడ్డట్టు  నేతలపై జిఎస్టి చరిత్ర బిజెపికే దక్కింది.జీఎస్టీ మీటింగ్‌ కౌన్సిల్లో  తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా దీనిమీద వేయొద్దు  చేనేత కార్మికులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మన తెలంగాణ రాష్ట్రం తరఫున వ్యతిరేకించాం.కక్షగట్టి చేనేత కార్మికుల మీద జిఎస్టి వేసింది బిజెప్‌ఎందుకు ఓటేయాలి ఏ చేనేత కార్మికుడైన  ఓటేయాల్నా బీడీ కార్మికులైన ఇంకా ఓటేయాలా.పాల మీద కూడా జిఎస్టి వేసినారు.రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.కెసిఆర్‌ అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారు.రాష్ట్రము అభివృద్ధిలోకి పోవాలంటే కేసీఆర్కే పట్టం కట్టాలి.ఈరోజు కాంగ్రెస్‌ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే  ఐడి గ్యారెంటీ ల పేరిట కర్ణాటకలో మోసం చేసింది.వాళ్లే అంటున్నారు రాహుల్‌ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి  ఐదు గ్యారెంటీ కార్డులను ఇచ్చి ఊదరగొట్టిండ్రు ఎన్నికల ప్రచారంలో లొల్లి లొల్లి చేసిండ్రుఎన్నికల అయిపోయిన తర్వాత రాహుల్‌ గాంధీ జాడలేదు గాంధీ జడ లేదు. మాటల గారెడితో ప్రజలను మోసం చేసేది ఎవరో అందరికీ తెలుసు దుబ్బాక ప్రజలంతా పనిచేసే వారికి పట్టం కట్టండి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page