దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలి ఎల్బీనగర్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థుల ఫోరం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 20 :  ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బిఆర్ఎస్ కు అమ్ముడు పోయిన ఎల్బీనగర్ ఎమ్యెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థుల ఫోరం నేత మంచాల శ్రీకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క ఎల్బీనగర్ చౌరస్తా ప్రధాన రహదారి తప్ప నియోజకవర్గం అభివృద్ధి చేసిందేమిలేదన్నారు. తొంబై శతం రోడ్లన్నీ గుంతలు, గతుకులతో దర్శనం ఇస్తున్నాయని అన్నారు. కమిషన్ లు దండుకొని కాలనీల్లో నాసి రకం రోడ్లు వేయించడం వల్ల పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, మంచి నీరు వంటి కనీస సౌకర్యాలు అందాకా కాలనీల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూ దందాలు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దొబ్బడం తప్ప సుదీర్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమిలేదని అయన మండిపడ్డారు. స్థానిక ఎలక్షన్ కమిషన్ అధికారులు, పోలీసులు సుదీర్ రెడ్డికి వత్తాసు పలుకుతూ, తమ ఎన్నికల ప్రచార వాహనాలకు అనుమతి ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, ప్రచారానికి ఇంకా ఏడు రోజులే మిగిలి ఉన్నాయని వాపోయారు. ఈ సమావేశంలో ఫోరం నేతలు షణ్ముఖ చారి, వై.జోత్స్నా రాణి, అయ్యల సోమయాజులు నాగ శ్రీనివాస్, కోడూరు రవి, నౌకట్ బాలకీర్తి రాణిల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page