33 రోజులు ..60 సభలు ..!

  • హుస్నాబాద్‌ నుంచి చేర్యాలదాకా
  • ఆక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 18వరకు
  • దిగ్విజయంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు..
  • ఆలోచించి చర్చించి విచక్షణ తో ఓటువేయాలి..ఎవరేందో ఎరుకతో గెలిపించాలి
  • కారు గుర్తుకు వోటేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలి: ప్రజలకు సీఎం కెసిఆర్‌ పిలుపు

ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,నవంబర్‌18:      అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు, అందులో భాగంగా  పాల్గొంటున్న ప్రజాఆశీర్వాద సభలు శనివారం చేర్యాల లో జరిగిన సభతో  60 కి చేరుకున్నాయి.33 రోజులపాటు అప్రతిహతంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు, జన ప్రవాహం తో బీఆర్‌ఎస్‌ విజయోత్సవల సభలను తలపిస్తున్నాయి.  ప్రతీసారి సాధారణ ఎన్నికలకు ముందు ప్రారంభించినట్టే ఈ సారి ఎన్నికల్లో కూడా హుస్నాబాద్‌ నుంచే ప్రజాఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు.
ఆక్టోబర్‌ 15 నుంచి మొదలైన ఈ సభలు రెండు విడతలుగా సాగి నవంబర్‌ 18నాటికి 33 రోజులు పాటు 60 సభలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అధినేత సీఎం కేసీఆర్‌ చెప్తున్న 60 ఏండ్లుగా జరగని అభివృద్దిని పదేళ్లలో చేసి చూపించిన రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతీ సభలో గత ప్రభుత్వాలకు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనకు తేడాలు గుర్తించాలని సీఎం ఇస్తున్న పిలుపుకు ప్రజలు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.
రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌, పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోకి పంటలకు సంబంధించిన డబ్బులు జమ చేయడం వంటి అనేక అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రజాఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి చేసిన  ప్రసంగాలకు…జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాదసభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను…చెప్పే మాటలను విని వుట్టిగనే పోవద్దు.. చెప్పిన మాటలను గ్రామాల్లో చర్చకు పెట్టాలని  పిలుపుకు ప్రజలు ఆలోచన చేస్తూన్నరు.

kcr womens in public meeting
గతంలో ఏ పాకులైనా ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ పాలనలో ఇచ్చినట్లు వేలల్లో పెన్షన్‌ ఇచ్చారా? అంటూ కేసీఆర్‌ ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో ప్రశ్నించారు. గతంలో ఎట్లుండె తెలంగాణ .,.ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలకు గుర్తు చేశారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, చెక్‌ డ్యాంలు, సాగునీటి  ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటికి , త్రాగునీటికి కొరత లేకుండా పోయిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్లు, కరెంటు, సాగునీళ్ల మీద ఖమ్మం ప్రజాఆశీర్వాద సభలో గుర్తుచేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. తెలంగాణ ఆవిర్భావానికి  ముందు త్రాగునీటి ఇబ్బందులు చాలా ఉండేవి. ట్యాంకర్ల తో తరలించడం లేకుంటే కిలోమీటర్లు నడిచి బిందెపై బిందె ఎత్తుకుని మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు పోయేవాళ్లు. అప్పుడు తెలంగాణ అట్ల ఉండే ? ఇప్పుడు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి పైసా ఖర్చు లేకుండా నల్లా నీళ్లు వొస్తున్నాయి. అప్పటి లెక్క ఇప్పుడు మంచినీళ్ల గోస ఉందా అని సభల్లో కేసీఆర్‌ ప్రజలను ప్రశ్నిస్తుంటే ప్రజల్లో సానుకూల స్పందన కనిపించింది.

24 గంటల కరెంటు కావాలా? కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నట్లు 3 గంటల విద్యుత్‌ కావాలా? అంటూ చెన్నూరు ప్రజా ఆశీర్వాదసభలో కేసీఆర్‌ అడుగుతుంటే ప్రజలందరూ 24 గంటలు కరెంటు కావాలంటూ చేతులెత్తి జై కొట్టారు.  ధరణి విషయంలో కూడా కాంగ్రెస్‌ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బోథ్‌ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క చెప్పుతున్నట్లు ధరణి ఉండాలా…వద్దా? అని ప్రజలను ప్రజా ఆశీర్వాద వేదికలపై నుంచి అడుగుతుంటే ఉండాలంటూ ముక్తకంఠంతో ప్రజలందరూ చెబుతున్నారు. చొప్పదండి ప్రజా ఆశీర్వాదసభలో రైతుబంధు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ .రైతుబంధు పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను, రైతు బంధు పేరిట దుబారా చేస్తున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపిస్తున్నారని.. మరి రైతుబంధు ఉండాలా? వద్దా? అనే అంశంపై ప్రజలను సభా వేదిక నుంచి సీఎం కేసీఆర్‌  ప్రశ్నిస్తే, రైతుబంధు ఉండాల్సిందేనంటూ ప్రజలు ముక్తకంఠంతో  నినాదాలు చేశారు.

దళితబంధు విషయం ప్రస్తావిస్తూ.. దళితబంధులాంటి పథకం పెట్టాలని, ఉచితంగా పది లక్షల సాయం చేయాలని, దళితుల జీవితాలు మార్చాలనే ఆలోచన గతోం ఎవరైనా చేశారా..అని చొప్పదండి ప్రజాఆశీర్వాద సభా వేదికపై నుంచి ముఖ్యమంత్రి చెబుతుంటే ప్రజలంతా చేతులెత్తి జై కొట్టారు. దళితులను వెలివాడలకు పరిమితం చేసింది కాంగ్రెస్‌ అంటూ సీఎం కేసీఆర్‌ విపక్షాలను విమర్శించారు.అదేవిధంగా మైనారిటీలను కూడా గత పాలకులు వోటు  బ్యాంకుగా వాడుకున్నారని ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇలా ప్రజాఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రసంగాలు ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలను సబ్బండ వర్గాలను ఆలోచింపచేస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎట్లుండే..ఇప్పుడు తెలంగాణ ఎట్లుందని బేరీజువేసుకుంటున్నారు.బిఆర్‌ఎస్‌ పార్టీ ని, పార్టీ అధినేత ను ఎమ్మెల్యే లను నోటికొచ్చినట్టు కూస్తున్న బూతుకుతలు..వారి లెక్కదప్పిన మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తెచ్చి నిలబెట్టుకున్న తనలాంటి వాడికి పిండం పెడుతానని దుర్మార్గంగా మాట్లాడుతున్న రేవంత్‌ రెడ్డిని ఎన్నికల్లో ఓడిరచి ప్రజలే పిండం పెట్టాలని కోరారు. వొచ్చిన తెలంగాణను ఆగం చేసిన కాంగ్రేస్‌ పార్టీ ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page