‌ప్రజల బాగుకోసమే ఆరు గ్యారంటీలు

  • మోదీ, కెసిఆర్‌ ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం
  • ప్రజల కోసం తెలంగాణ ఇస్తే దోచుకుంటున్నారు
  • సర్వ మాతాలకు మా మ్యానిఫెస్టో హామీపత్రం
  • ‘అభయహస్తం’ పేరున కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను విడుదల చేసిన ఖర్గే  
  • ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌
  • ‌జాబ్‌ ‌క్యాలెండర్‌ను కూడా విడుదల చేసిన పార్టీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టో అని ఏఐసీసీ చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం 37 అంశాంలతో తెలంగాణకు ‘అభయహస్తం’ పేర కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను  ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్‌ ‌సర్కార్‌ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుందని…ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదని అన్నారు. మోదీ, కేసీఆర్‌ ‌కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని..జనాలు ఇప్పటికే డిసైడ్‌ అయిపోయారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఫార్మ్ ‌హౌస్‌లోనే ఉండే కేసీఆర్‌ ఇక…అక్కడే ఉండిపోతారని.. జనాలు బై బై కేసీఆర్‌.. ‌టాటా కేసీఆర్‌ అం‌టారని అన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు.

జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే…జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. కర్ణాటకలో చెప్పిన ప్రతి హావి•నీ తాము నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్‌ అమలు చేసి తీరుతామని..కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చాక కేబినెట్‌ ఏర్పాటె•న తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మా తొలి లక్ష్యం..మహాలక్ష్మి పథకం..ప్రతి నెలా రూ.2500, రూ.500కే గ్యాస్‌, ‌బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ..అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇక తమ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితమని ఖర్గే స్పష్టం చేశారు. సర్వమతాలకు కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టో హావి• పత్రమని..హిందువులకు భగవత్‌ ‌గీత, ముస్లింలకు ఖురాన్‌, ‌క్రిస్టియన్‌లకు బైబిల్‌ ‌తమ మేనిఫెస్టో అని ఏఐసీసీ చీఫ్‌ ‌వెల్లడించారు. దాదాపు 42 పేజీలతో కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను విడుదల చేశారు. అలాగే జాబ్‌ ‌క్యాలెండర్‌ను కూడా హస్తం పార్టీ విడుదల చేసింది. గ్రూప్‌ -1 ఉద్యోగాల భర్తీ డేట్‌ను కూడా ప్రకటించింది. ఫిబ్రబర్‌ 1, 2024‌లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ ‌ప్రకటించింది.

కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోలోని అంశాలు..
నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగం కల్పించే వరకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్‌ ‌లాగ్‌ ‌పోస్టుల భర్తీ, 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్‌ ‌స్కూటర్లు , ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, ఏబీసీడీ వర్గీకరణ, బెల్ట్ ‌షాపులు రద్దు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం,గౌరవ భృతి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, 3 ‌లక్షల వడ్డీ లేని పంట రుణం, కోతుల నివారణకు ప్రతీ జిల్లాలో స్టెరిలైజ్‌ ‌కేంద్రం, కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ, చెరువుల నిర్వాహణ,మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత, తొలి క్యాబినెట్‌లో మెగా డీఏస్సీ, రూరల్‌ ‌యూత్‌ ‌ఫైనాన్స్ ‌కార్పోరేషన్‌కు రూ.1000 కోట్ల బడ్జెట్‌, ‌విద్యార్థులకు ఫ్రీ ఇంటర్‌ ‌నెట్‌, ‌విద్యా రంగానికి బడ్జెట్‌లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు, ఖమ్మం, ఆదిలాబాద్‌లలో నూతన విశ్వవిద్యాలయాలు, వైద్య రంగం బడ్జెట్‌ ‌రెట్టింపు, ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌, ‌రేషన్‌ ‌ద్వారా సన్న బియ్యం, రేషన్‌ ‌డీలర్‌లకు రూ.5 వేల గౌరవ భృతి, కొత్త రేషన్‌ ‌కార్డులు, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీన పక్రియ పూర్తి చేస్తాం, ప్రతీ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం, కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం, మహిళా సంఘాలకు పావులా వడ్డీ రుణాలు, జూనియర్‌ ‌న్యాయవాదులకు మొదటి 5 సంవత్సరాలు నెలకు రూ.5 వేల గౌరవ భృతి, 100 కోట్లతో జర్నలిస్ట్‌ల సంక్షేమ నిధి, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ళ సమస్యకు పరిష్కారం, ఎన్నారైల సంక్షేమ బోర్డ్, ‌దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్‌, ‌దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నెలకు రూ.12 వేలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page